జాతీయ వార్తలు

కాలుష్య నియంత్రణలో దేశంలోనే తెలంగాణ ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: వాయు కాలుష్య నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం లోక్‌సభలో రూల్ 193 కింద ప్రవేశపెట్టిన వాయు కాలుష్య, వాతావరణ మార్పుల అంశంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ వాయు కాలుష్యం అగ్రభాగాన ఉన్న పది పట్టణ ప్రాంతాల్లో తొమ్మిది నగరాలు మన దేశంలోనే ఉన్నాయని, అలాగే ప్రపంచంలో 20 వాయు కాలుష్య ప్రభావం అధికంగా వున్న నగరాల్లో 15 మన దేశంలో వున్నాయని అన్నారు. అఖిలపక్ష సమావేశంలో ప్రధాన మంత్రి మోదీ మాట్లాడుతూ ఈ వాయు కాలుష్యం విషయమై సలహాలు సూచనలు ఏమైనా చేయమని అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో గత ఐదేళ్ల కాలంలో హరితహారం కింద సూమారు 176 కోట్ల మొక్కలను నాటడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 12,751 గ్రామాల్లో నర్సరీలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అలాగే ప్రభుత్వం, అటవీ భూముల్లో 77 అర్బన్ పార్కులను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. వైసీపీ లోక్‌సభా పక్ష నాయకుడు పి.మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకూడదని హితవు పలికారు. పర్యావరణ పరిరక్షణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను స్వాగతించిన ఆయన పర్యావరణ పరిరక్షణకు అందరూ కట్టుబడి వుండాలని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.