జాతీయ వార్తలు

యురేనియం తవ్వకాలకు అనుమతులివ్వలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వ ఎటువంటి అనుమతులివ్వలేదని కేంద్ర అణు ఇందన శాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్ వెల్లడించారు. యురేనియం తవ్వకాలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నా యుడు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లఖిత పూర్వకంగా సమాధానం ఇ చ్చారు. యురేనియం తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
వివిధ కమిటీల్లో తెలుగు ఎంపీలకు స్థానం
కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ కమిటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులకు స్థానం దక్కింది. కేంద్ర హోం శాఖ కన్సల్టేటివ్ కమిటీలో బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చోటు దక్కిం ది. ఈ కమిటీకి అమిత్ షా నేతృత్వం వహిస్తారు. అలాగే రోడ్లు రహదారుల శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా కేశినేని నాని, యువజన వ్యవహారాల శాఖ కన్సల్టేటివ్ కమిటి సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు, గృహ, పట్టణాభివృద్ధి శాఖ కన్సల్టేటివ్ సభ్యులుగా తోట సీతారామలక్ష్మి, గల్లా జయదేవ్ స్థానం దక్కించుకున్నా రు. రోడ్లు రహదారులు కన్సల్టేటివ్ కమిటీలో టీఆర్‌ఎస్ ఎంపీ గెడ్డం రంజిత్‌రెడ్డికి స్థానం లభించింది.