జాతీయ వార్తలు

సరోగసీ మహిళలకు జీవితాంతం బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: కేంద్రం తీసుకొస్తున్న సరోగసి (అద్దె గర్భం) నియంత్రణ బిల్లు-2019కు రాజ్యసభలో టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ బిల్లుపై బుధవారం జరిగిన చర్చలో ఆ పార్టీ సభ్యుడు బండా ప్రకాశ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బిల్లులో అన్ని విషయాలు స్పష్టంగా లేవని.. బిల్లులో మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు లేవని పేర్కొన్నారు. అబార్షన్ గురించి బిల్లులో ఎటువంటి స్పష్టత లేదని.. గర్బవతి మహిళకు కేవలం 16 నెలలు మాత్రమే బీమా కల్పించడం సరైన విధంగా లేదని అన్నారు. సరోగసీ మహిళలకు జీవితాంతం బీమా కల్పించాలని కేంద్రాన్ని కోరారు. 16 నెలల తర్వాత సరోగసీ మహిళ రక్షణ ఎవరు చూసుకుంటారని ఆయన ప్రశ్నించారు.
రక్షణ శాఖ భూములు కాపాడాలి
సికింద్రాబాద్ కంటోనె్మంట్ పరిధిలోని రక్షణ శాఖ భూములను కా పాడాలని టీఆర్‌ఎస్ లోక్‌సభ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. మూడు నాలుగు దశాబ్దాలుగా రక్షణ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అన్నారు.
ఆర్టీసీ సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోవాలి
తెలంగాణలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ విజ్ఞప్తి చేశారు. కార్మికులు 50 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. ఆత్మహత్యలు చేసుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు.
జీఎస్టీ నిధులు విడుదల చేయాలి
2017-18, 2018-19 సంవత్సరాలకుగాను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారం తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో టీఆర్‌ఎస్ ఎంపీలు కేశవరావు, లింగయ్య యాదవ్ కలిసి తెలంగాణకు రూ.2812 కోట్లు ఇవ్వాల్సి వుందని, వీలైనంత త్వరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
మెడికల్ కాలేజీ మంజూరు చేయండి
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్థన్ నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.