జాతీయ వార్తలు

ఒడిశాకు మరిన్ని విమాన సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: ఒడిశా రాజధాని భువనేశ్వర్ సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. రాష్ట్రం నుంచి మరిన్ని విమాన సర్వీసులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్‌సింగ్ పూరి వెల్లడించారు. బుధవారం రాజ్యసభ ప్రశ్నోతర సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. పశ్చిమ ఒడిశాలోని ఝార్సుగుడా విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. అయితే విమానాశ్రయం నుంచి పూర్తిస్థాయిలో విమానాలు రాకపోకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి చెప్పారు. భువనేశ్వర్ సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు భూ సమస్య ఉందని పూరి స్పష్టం చేశారు. ‘అధికారులు మూడు స్థలాలను చూశారు. అయితే ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు వాటిపై సంతృప్తి చెందలేదు. కొన్ని ప్రతికూల అంశాలు లేవనెత్తారు. నాలుగో స్థలం కోసం సంప్రదింపులు సాగుతున్నాయి’అని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వౌలిక సౌకర్యాలు కల్పిస్తే ఎయిర్‌పోర్టులు, విమాన సర్వీసులపై దృష్టిపెడతామని ఆయన అన్నారు. కాగా 150 కిలోమీటర్ల లోపల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు నిర్మించే యోచన లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న విమానాశ్రయానికి సామర్ధ్యం లేకపోతే అప్పుడు ఆలోచించవచ్చని ఆయన చెప్పారు. స్థలం అంశంతోపాటు వౌలిక సదుపాయాలు కల్పించి కేంద్రానికి సహకరించాలని ఒడిశా సర్కార్‌కు ఆయన సూచించారు. గత ఏడాది ప్రారంభించిన ఝార్సుగుడా ఎయిర్ పోర్టు నుంచి సంతృప్తికరంగా విమాన సర్వీసులు లేవన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురాగా‘ అక్కడ అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. ఎటొచ్చీ పౌర విమానయాన వౌలిక సదుపాయల సమస్యే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే సంతోషం’అని అన్నారు.
*చిత్రం... కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్‌సింగ్ పూరి