జాతీయ వార్తలు

పదునెక్కుతున్న సంకీర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తున్న కాంగ్రెస్, ఎన్సీపీలు శివసేనతో కలిసి తమ వ్యూహానికి పదును పెడుతున్నాయి. ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే అందుకు సంబంధించిన కనీస ఉమ్మడి ఎజెండా ఏవిధంగా ఉండాలన్న దానిపై వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తోంది. గత మూడు రోజులుగా ఈ మూడు పార్టీల నేతలు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎడతెగని మంతనాల్లో తలమునకలయ్యారు. శివసేనతో కలిసి పొత్తు పెట్టుకునే విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి చాలా స్పష్టంగానే సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మూడు పార్టీలు కలిస్తే స్థిరమైన, బలమైన ప్రభుత్వం ఏర్పడుతుందని, చర్చల అనంతరం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ తెలిపారు. అలాగే ఈ రెండు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు గురువారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ఆయన ఇంట్లోనే కలుసుకుని పాలనకు సంబంధించిన కనీస ఉమ్మడి కార్యక్రమంపై చర్చించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, జైరామ్ రమేష్, మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ నేతలు ప్రపుల్ పటేల్, సుప్రియా సూలే, అజిత్ పవార్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అంశంపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నేతలు శుక్రవారం కలిసికట్టుగా ఓ ప్రకటన చేసే అవకాశం కనపడుతోంది. అనంతరం తమ పొత్తుకు సంబంధించిన వివరాలతో గవర్నర్‌కు విడిగా లేఖలు పంపుతారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. గత మూడు రోజులుగా జరుగుతున్న చర్చలు సానుకూలంగానే కొనసాగాయని ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వస్తుందని శివసేన నాయకుడు సంజయ్ రావత్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ అధినేత్రి సోనియా, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మధ్య ఎలాంటి సమావేశం జరిగే అవకాశం లేదని ఆయన వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీచేసి మెజార్టీ సాధించిన బీజేపీ, శివసేనల మధ్య పదవుల పేచీ కారణంగా విభేదాలు తలెత్తాయి. దాంతో బీజేపీతో మూడు దశాబ్దాల బంధాన్ని శివసేన పెంచుకుంది. ఏ పార్టీ వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోవడంతో మహారాష్టల్రో రాష్టప్రతి పాలన విధించారు. అనూహ్య రీతిలో తమ బద్ధ శత్రువైన శివసేనతోనే కాంగ్రెస్, ఎన్సీపీలు జతకట్టి కొత్త ప్రభుత్వ ఏర్పాటులో తలమునకలయ్యాయి. ఇదిలావుండగా మహారాష్టల్రో శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడమేనని ఆ పార్టీ నాయకుడు సంజయ్ నిరుపమ్ హెచ్చరించారు. ఎవరి ఒత్తిళ్లకు లొంగవద్దని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి విజ్ఞప్తిచేశారు. కొనే్నళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ ఇదే తప్పు చేసిందని, అప్పటినుంచి ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పట్టు లేకుండా పోయిందని నిరుపమ్ గుర్తుచేశారు.