జాతీయ వార్తలు

డిజిటల్ ప్రపంచానికి దీటుగా ఆడిటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: ప్రభుత్వ విభాగాల్లో జరిగే అవినీతిని పూర్తిగా అదుపు చేసేందుకు తగిన సాంకేతిక మార్గాలను అందుబాటులోకి తేవాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)ను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దడంలో క్రియాశీలక భూమిక పోషించాలని అన్నారు. నేటి డిజిటల్ ప్రపంచానికి అనుగుణంగా ఆడిటింగ్‌లో పరివర్తన తీసుకురావడంపై గురువారం ఇక్కడ జరిగిన కాగ్ సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాలనా సామర్థ్యాన్ని మెరుగు పర్చడంలో ఆడిటర్ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. 2022 నాటికి సాక్ష్యాధారాల ఆధారంగా విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలనుకొంటోందని.. ఇందుకు అవసరమైన రీతిలో కాగ్ గురుతర భూమిక పోషించాలని అన్నారు. డేటా విశే్లషణతో పాటు ఈ విధానానికి కాగ్ అత్యంత కీలకం కావాలని మోదీ కోరారు. అవినీతి దగాకోరు వ్యవహారాలకు పాల్పడేవారికి కళ్లెం వేసే విధంగా అంతర్గతంగాను, బహిర్గతంగాను పదునైన విధానాలను అందుబాటులోకి తేవాలన్నారు. ఇందుకు వీలుగా ఆడిటింగ్ వృత్తికి సంబంధించిన విలువలను మరింతగా పెంపొందించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థల్లో అవినీతి, దగాకోరు లావాదేవీలను నిరోధించడానికి ఈ ఐదేళ్లలో ఎన్నో ప్రయత్నాలు చేశామని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సాక్ష్యాధారాల విధానాన్ని పాలనలో భాగం చేయడం వల్ల అవినీతిని పూర్తిగా అరికట్టవచ్చని మోదీ తెలిపారు. ఇందుకు వీలుగా ఆడిటర్లు సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆ విధంగా నవ భారతానికి సరికొత్త గుర్తింపునివ్వాలని మోదీ అన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా ప్రభుత్వం పురోగమిస్తున్నందున ఈ పయనంలో ఆడిటర్ల పాత్ర కూడా కీలకమని అన్నారు. ఆడిటర్లు తీసుకొనే నిర్ణయాలు నేరుగానే ప్రభుత్వ విధానం, సామర్థ్యం, విధాన నిర్ణయం, వ్యాపారం, పెట్టుబడులు సహా అనేక అంశాలపై ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. ఇతరులను తప్పు పట్టే దృష్టిని వీడి ఒక సమగ్ర దృష్టితోనే కాగ్ తన బాధ్యతలు నిర్వర్తించాలని పేర్కొన్న ఆయన.. డిజిటల్ ఆడిట్, డిజిటల్ గవర్నెన్స్ వల్ల వ్యవస్థాగతంగా అనేక సమస్యలు మెరుగౌతాయని తెలిపారు.

*చిత్రం... ప్రధాని నరేంద్ర మోదీ