జాతీయ వార్తలు

27న పీఎస్‌ఎల్‌వీ-సీ 47 ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, నవంబర్ 21 : నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈనెల 27వ తేదీన పీఎస్‌ఎల్‌వీ-సీ 47 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈమేరకు ప్రయోగానికి సంబంధించి సర్వం సిద్ధం చేసినట్లు ఇస్రో వర్గాలు గురువారం తెలిపాయి. ముందస్తుగా ఇస్రో తెలిపినట్లు ఈనెల 25న తలపెట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగానికి సంబంధించి సాంకేతిక లోపం తలెత్తినట్లు అనుమానం రావడంతో ప్రయోగాన్ని ఈనెల 27వ తేదీకి వాయిదా వేశామన్నారు. ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ కార్టోశాట్-3 ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు భారత అంతరిక్ష సంస్థ ప్రకటించింది. ఈనెల 27వ తేదీ ఉదయం 9.28 నిమిషాలకు శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోని రెండవ లాంచ్ పాడ్ నుండి పిఎస్‌ఎల్‌వి-సి 47 నింగిలోకి దూసుకెళ్లనుంది. కార్టోశాట్-3 ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన 13 వాణిజ్యపరమైన నానో శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపనుంది. కార్టోశాట్-3ని 509 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టనుంది. హైరిజల్యూషన్ ఇమేజింగ్ కేపబిలిటి టెక్నాలజీ ద్వారా భూఉపరితల ఫోటోలను ఈ శాటిలైట్ తీస్తుంది. ఇందుకు సంబంధించిన ఎంఆర్‌ఆర్ సమావేశం మంగళవారం జరగనున్నట్లు వారు తెలిపారు.
కార్టోశాట్ ప్రయోగాన్ని నేరుగా చూడాలనుకునే వారికి ఇస్రో ప్రత్యేక అవకాశం కల్పించింది. శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోని లాంచ్ వ్యూ గ్యాలరీలో కూర్చొని ప్రత్యక్షంగా రాకెట్ ప్రయోగాన్ని వీక్షించవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఇస్రో సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి గురువారం నుండే రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది.
*చిత్రం... ప్రయోగానికి సిద్ధంగా ఉన్న పీఎస్‌ఎల్‌వీ-సీ 47 రాకెట్