జాతీయ వార్తలు

బెంగళూరులో బిజెపి నేత దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 16: బెంగళూరు నగరం నడిబొడ్డులో ఆదివారం ఉదయం బిజెపి నాయకుడు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. 35 ఏళ్ల రుద్రేశ్ ఆర్‌ఎస్‌ఎస్ శివాజీనగర్ శాఖ అధ్యక్షుడిగా, అదే ఏరియా బిజెపి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగివస్తూ ఉదయం 11.30 గంటల సమయంలో కామరాజ్ రోడ్డులోని రుద్రకృష్ణ ఆలయం వద్ద స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో నల్లరంగు పల్సస్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కత్తులతో దాడిచేసి రుద్రేశ్‌ను తీవ్రంగా గాయపరిచారు. వెంటనే అతడ్ని బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రుద్రేశ్ మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. రుద్రేశ్ శివాజీ నగర్ కాలనీలో రియల్ ఎస్టేట్‌తోపాటు పాల వ్యాపారం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.