జాతీయ వార్తలు

హేయం..ఘోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : అత్యంత హేయం, ఘోరం, పాశమికమంటూ ‘దిశ‘ అత్యాచారం, హత్య ఘటనపై లోక్‌సభ సభ్యులు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషుల్ని కఠినంగా శిక్షించాలని, త్వరిత గతిన శిక్ష అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఇలాంటి వారిని ఉరితీయాలని, రాళ్లతో కొట్టి చంపాలని, కాస్ట్రేషన్ వంటి కఠిన చర్యలూ తీసుకోవాలంటూ హైదరాబాద్ అమానుష ఘటనపై సభ్యులు డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టాన్ని సవరించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ప్రకటించారు. కిషన్ రెడ్డి సోమవారం లోకసభ జీరో అవర్‌లో హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో పశు వైద్యురాలిపై జరిగిన అత్యాచారంపై లోక్‌సభలో సభ్యుల జరిపిన చర్చకు బదులిస్తూ అత్యంత హీనమైన నేరాలకు పాల్పడే వారికి వీలున్నంత త్వరగా శిక్ష పడేలా చూసేందుకు తమ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పశు వైద్యురాలిపై జరిగిన అత్యాచారాన్ని అధికార, ప్రతిపక్షానికి చెందిన సభ్యులందరు తీవ్ర స్థాయిలో ఖండించారు. దేశంలో మహిళలకు భద్రత లేకుండాపోయిందని ప్రతిపక్షం సభ్యులు ఆరోపించారు.మహిళలపై అత్యాచారాలు చేసే వారిని ఉరితీయాలని కొందరు సభ్యులు డిమాండ్ చేస్తే మరి కొందరు వారిని కాస్ట్రేషన్‌కు గురి చేయాలి లేదా రాళ్లతో కొట్టి చంపాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత శిక్షా స్మృతి, సి.ఆర్.పి.సిని సవరించటం గురించి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. లోక్‌సభ ఈరోజు ఉదయం సమావేశం కాగానే పలువురు సభ్యులు లేచి శంషాబాద్ అత్యాచారం గురించి ప్రస్తావించారు. దీనికి స్పీకర్ ఓం బిర్లా బదులిస్తూ ఈ అంశందై జీరో
అవర్ చర్చకు అనుమతిస్తామంటూ వారిని శాంతపరిచారు. లోకసభ జీరో అవర్‌లో అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు సభ్యులు శంషాబాద్ అత్యాచారంపై మాట్లాడుతూ నేరస్తులను అత్యంత కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో విచ్చలవిడిగా కొనసాగుతున్న మద్యం విక్రయాల మూలంగానే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని టి.పి.సి.సి అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎం.పి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. నేరస్తులకు వెంటనే శిక్ష పడేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు 30 రోజుల్లో శిక్ష పడేలా చట్టం తీసుకురావాలని టిఆర్‌ఎస్ పక్షం నాయకుడు నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు టి.ఆర్.ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది, దుర్ఘతన జరిగిన ఆరు గంటల్లో నిందితులను అరెస్టు చేసిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు క్షేత్ర స్థాయిల సక్రమంగా అమలు కాకపోవటం వలన శంషాబాద్ లాంటి సంఘటనలు జరుగుతున్నాయని బిజెపి సభ్యుడు బండి సంజయ్ చెప్పారు. మహిళలపై జరిగే అత్యాచారాలకు సంబంధించిన కేసులు సంవత్సరాల తరబడి జరగటం వలన బాధితులకు న్యాయం లభించటం లేదన్నారు. నిందితులకు వెంటనే శిక్ష పడేలా చట్టాలను సవరించాలని సంజయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి సంఘటనల పట్ల శూన్య సహనం విధానాన్ని పాటించాలని ఎన్.సి.పి సభ్యురాలు సుప్రియా సూలే సూచించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం చట్టాలను సవరిస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.

*చిత్రం... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి