జాతీయ వార్తలు

పునరావాస పనులతోనే పోలవరం వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,డిసెంబర్ 2: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సహాయ, పునరావాస కార్యక్రమాలను అమలు చేసే తీరుపై పోలవరం నిర్మాణం పూర్తి కావటం ఆధారపడి ఉంటుందని, సహాయ, పునరావాస పనులను త్వరగా జరిగితే ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి అవుతుంది లేకపోతే ఆలస్యమవుతుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రులకు ‘లైఫ్ లైన్’ వంటిదని రాజ్యసభ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. వెంకయ్యనాయుడు పోలవరం ప్రాజెక్టు పనిపై చర్చ పూరె్తైన అనంతరం స్పందిస్తూ దీని నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ సభ్యుడు కె.వి.పి.రామచందర్‌రావు అడిగిన ప్రశ్నకు షేకావత్ సమాధానం ఇస్తూ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచానలను 55,458 రూపాయలుగా ఆమోదించినట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం గురించి రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో ఇప్పటికి రెండుసార్లు సమావేశం జరిపారు, కేంద్ర జలశక్తి శాఖ అడిగిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసి ఉన్నదని ఆయన చెప్పారు. ఆర్ అండ్ ఆర్, భూసేకరణ ధరల గురించి రాష్ట్ర ప్రభుత్వం నుండి సమాచారం రావలసి ఉన్నదని మంత్రి తెలిపారు. ముందు నిర్ణయించిన ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2018లో పూర్తి కావలసి ఉండగా ఇంత వరకు పూర్తి కాలేదు, దీని నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుందని రామచందర్‌రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తవారికి టెండర్లు ఇచ్చింది, సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు 2021 డిసెంబర్ నెలాఖరుకు పూర్తికావలసి ఉన్నదని షేకావత్ చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం పనులు నిజంగా ఎప్పుడు పూర్తి అవుతాయని కాంగ్రెస్ సభ్యుడు జయరాం రమేష్ ఆడిగిన అనుబంధ ప్రశ్నకు షేకావత్ సమాధానం ఇస్తూ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ సమస్యలు చాలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ సమస్యలను ఎంత త్వరగా పరిష్కరిస్తే ప్రాజెక్టు నిర్మాణం అంత త్వరగా పూర్తి అవుతుందని బదులిచ్చారు. పోలవరం ప్రాజెక్టు మూలంగా ఒడిశ్శాలోని దాదాదు ఆరువేల మంది గిరిజనులు తమ భూములను కోల్పోయి నిరాశ్రయులవుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలుమార్లు ప్రధానికి లేఖ రాశారు, ఈ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని బి.జె.డి సభ్యుడు శశ్మిత్ పాత్ర ప్రశ్నించారు. వేలాది ఎకరాలు ముంపుకు గురి అవుతున్నాయని చెప్పారు. ఒడిశ్శా ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ఇంతవరకు పరిష్కరించలేదని శశ్మిత్ పాత్ర చెప్పారు. ఒడిశ్శా, చత్తీస్‌గడ్, తెలంగాణా పోలవరం విషయంలో లేవనెత్తిన అభ్యంతరాలు సుప్రీం కోర్టు పరిశీలనలో ఉన్నాయి కాబట్టి దీనిపై తానేమీ చెప్పలేనని జలశక్తి శాఖ మంత్రి స్పష్టం చేశారు.

*చిత్రం... రాజ్యసభలో కేంద్ర మంత్రి షెకావత్