జాతీయ వార్తలు

క్షమాభిక్ష ప్రసక్తే వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:మహిళలపై అత్యాచారం నేరం కింద ఉరిశిక్ష లేదా ఆమరణ కారాగార శిక్ష అనుభవిస్తున్న వారికి క్షమాబిక్ష పెట్టటం అనేది ఉండకూడదని రాజ్యసభ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. వెంకయ్యనాయుడు సోమవారం రాజ్యసభలో మహిళలపై జరిగే అత్యాచారాలపై చర్చ జరిగిన అనంతరం మాట్లాడుతూ మహిళలపై దారుణంగా హత్యాచారం చేసే వారికి క్షమాభిక్ష ఏమిటని ఆవేశంతో ప్రశ్నించారు. హైదరాబాద్ ఘటన అమానవీయమంటూ సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి క్రూర,దారుణ సంఘటనల పట్ల దేశ వ్యాపితంగా ఆందోళన వ్యక్తమవుతోందని ఆయన చెప్పారు. మానవత్వం సిగ్గుపడే ఇలాంటి సంఘటనలు ఒక్క హైదరాబాదుకే పరిమితం కాలేదన్నారు. ఓ తల్లి,చెల్లి,్భర్య, కూతురుగా మహిళ చూపించే ప్రేమానురాగాలు అతుల్యమని వెంకయ్యనాయుడు ఆవేశంతో చెప్పారు. ఈ దురాగతాలను అరికట్టేందుకు మనమందరం బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఒక పరిష్కారం, జువినల్ అనే అంశంపై కూడా మనం తీవ్రంగా చర్చించాలన్నారు. అత్యాచారానికి వయస్సుతో ఏం సంబంధం, అత్యాచారం అత్యాచారమేనని వెంకయ్యనాయుడు అన్నారు. అత్యాచారాలను అరికట్టేందుకు కొత్తగా మనకు ఒక బిల్లు అవసరం లేదు, ఇలాంటి దురాగతాలను అరికట్టాలనే ‘పొలిటికల్ విల్ పరిపాలనా సంబంధమైన స్కిల్’ కావాలన్నారు. మనమందరం కలిసి కృషి చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. క్షమాభిక్ష వ్యవహారం సంవత్సరాల తరబడి జరగాలా? అని ఆయన ప్రశ్నించారు. మహిళలపై అత్యాచారం చేయటం అనేది ఒక సమాజిక రుగ్మత అని ఆయన అన్నారు. మహిళలను అగౌరవపరిచే అన్ని రకాల కార్యక్రమాలను నిలిపవేయాలన్నారు. కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, తదితరులు కలిసికట్టుగా కృషి చేస్తేనే ఈ సమస్యను పరిష్కరించగలుగుతామన్నారు. ప్రజల ఆలోచనాధోరణిలో మార్పు వచ్చిన రోజే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వెంకయ్యనాయుడు తెలిపారు.
*చిత్రం... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు