జాతీయ వార్తలు

ఆస్తుల వివరాలు వెల్లడించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: విదేశీ, స్వదేశీ నిధులతో నడుస్తున్న స్వచ్చంద సేవా సంస్థలు విధిగా ఆస్తులు, వ్యయాల వివరాలు అందజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంస్థలే కాకుండా వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆదాయ, వ్యయాలు వెల్లడించాలని లోక్‌పాల్ చట్టంలో ఉంది. తమ వద్ద ఉన్న నగలు, బ్యాంకులో ఉన్న డిపాజిట్లు, చేతిలో ఉన్న నగదు, బాండ్ల రూపంలో ఉన్న పెట్టుబడులు, కంపెనీల్లో షేర్లు ప్రభుత్వానికి తెలియజేయాలి. ఆస్తుల డిక్లరేషన్ ఫారంలో విధిగా తెలపాల్సిందేనని చెప్పారు. లోక్‌పాల్, లోకాయుక్త-2013 చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆస్తుల వివరాలు వెల్లడించాలి. డైరెక్టర్, మేనేజర్, కార్యదర్శి లేదా అధికారి హోదాలో స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్న వారు ప్రతి ఏటా ఆస్తులు, అప్పుల వివరాలు తెలియజేయాలని చట్టం చెబుతోంది. ఈ ఏడాది వివరాలు అందించేందుకు డిసెంబర్ 31న ఆఖరి తేదీ. ప్రభుత్వం నుంచి కోటి రూపాయల గ్రాంటు లేదా విదేశాల నుంచి విరాళాల రూపేణా పది లక్షలు అందుకునే సంస్థలు చట్టం పరిధిలోకి వస్తాయి. నేషనల్ సేవింగ్స్ పథకం, పోస్టల్ సేవింగ్స్, వివిధ రకాల బీమా పాలసీలు, సంస్థల్లో పెట్టుబడుల విరాలన్నీ వెల్లడించాల్సిందేని పేర్కొన్నారు. అంతేగాక మోటర్ వెహికిల్స్/విమానాలు/బోట్లు/నౌకలు (రిజిస్ట్రేషన్ నెంబర్లు, ఎప్పుడు కొన్నది, ఎంతకు కొన్నది) పూర్తి వివరాలతో తెలియజేయాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.