జాతీయ వార్తలు

అధికార సమావేశానికి ఉద్ధవ్ మేనల్లుడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 4: మహారాష్టలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వంపై బీజేపీ అప్పుడే విమర్శలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మేనల్లుడు, యువసేన కార్యదర్శి వరుణ్ సర్దేశాయి అధికారిక సమావేశానికి హాజరయ్యారని పార్టీ ఆరోపించింది. సచివాలయాన్ని ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా మార్చేశారని బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారీ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యువసేన నేత వరుణ్ సర్దేశాయి హాజరయ్యారు. సీఎం ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య థాక్రే ఇంతకు ముందు శివసేన బాధ్యతలు చూసేవారు. ఆయన ముంబయిలోని వర్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికకావడంతో ఆ బాధ్యతలు వరుణ్ చేపట్టారు. శివసేన అనుబంధం సంస్థే యువసేన. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సతీమణి రష్మీ థాక్రే సోదరుడి కుమారుడే వరుణ్ సర్దేశాయి. సోమవారం నాటి సమావేశంలో ఉద్ధవ్ థాక్రే పక్కనే వరుణ్ కూర్చున్న ఫొటోలు మీడియాలో రావడంతో వివాదాస్పదమైంది.
ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యామ్నాయ అధికార కేంద్రం ఏర్పాటు చేసేశారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రభుత్వ నియమ, నిబంధనలు ఉల్లంఘించడమేనని ఆయన ఆరోపించారు. దీనిపై సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాన పక్షమైన ఎన్‌సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ స్పందిస్తూ ‘ఇది కొత్త ప్రభుత్వం, పరిపాలన అనుభవం లేదు’అని అన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కావని ఆయన వివరించారు. బీజేపీ ఆరోపణలపై వరుణ్ సర్దేశాయి తిప్పికొట్టారు. తొలుత ఇది పెద్ద తప్పుకాదని వివరణ ఇవ్వబోయిన యువసేన నేత ‘అక్కడ సున్నితమైన అంశాలేవీ చర్చించలేదు. పర్యాటక రంగానికి సంబంధించిన సాధారణ విషయాలే మాట్లాడారు. దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు’అని అన్నారు. ఇదేమీ హోం శాఖ సమావేశం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో ఊరుకోకుండా ‘దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన భార్య అమృత ఫడ్నవీస్ అధికారిక సమావేశాలకు హాజరయ్యేవారు’అని వరుణ్ ఎదురుదాడి చేశారు. బీజేపీ అధినాయకులే ప్రభుత్వ సమావేశాలకు వెళ్లిన సందర్భాలున్నాయని యువసేన నేత ఎద్దేవా చేశారు.