జాతీయ వార్తలు

‘హిందుత్వ’ తీర్పుపై పునర్విచారణ ప్రారంభించిన ‘సుప్రీం’ ధర్మాసనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఎన్నికల లబ్ధి కోసం మతాన్ని దుర్వినియోగం చేయడాన్ని దుష్ట సంప్రదాయంగా పేర్కొంటూ దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఎన్నికల చట్టానికి సంబంధించి తాను ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలంటూ దాఖలయిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ ప్రారంభించింది. ‘హిందుత్వ’ తీర్పుగా అభవర్ణించే ఈ తీర్పు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సాయం తీసుకోవాలంటూ కొంతమంది కక్షిదారులు చేసిన అభ్యర్థనను పట్టించుకోని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం విచారణను ప్రారంభించాలని నిర్ణయించింది. ‘ఒక చట్టానికి భాష్యం చెప్పాల్సిన ప్రతి కేసులోను అటార్నీ జనరల్ సహాయం అవసరమని మీరు చెప్తున్నారా?’ అని ఎజి సాయం తీసుకోవాలని కోరిన న్యాయవాదినుద్దేశించి బెంచ్ ప్రశ్నించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఈ బెంచ్‌లో న్యాయమూర్తులు మదన్ బి లోకుర్, ఎస్‌ఏ బోబ్డే, ఎకె గోయల్, యుయు లలిత్, డివై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వర్ రావులున్నారు. బెంచ్ ఏయే అంశాలను పరిశీలించాలి, ఈ అంశాల్లో కొన్నిటిని మూడు, లేదా అయిదుగురు న్యాయమూర్తులుండే చిన్న బెంచీలకు పంపించాలా అనే అంశాలపై బెంచ్ విచారణ ప్రారంభించింది.కాగా, తనక్లయింట్‌లాంటి పరిస్థితుల్లో ఉన్న వారందరికీ సుప్రీంకోర్టునుంచి ఇప్పటికే ఊరట లభించినందున తన క్లయింట్ అయిన బిజెపి నాయకుడు అభిరామ్ సింగ్ కేసును ఈ విచారణనుంచి వేరు చేయాలని వాదనల ప్రారంభంలో సీనియర్ అడ్వకేట్ అరవింద్ దాతర్ కోరారు.