జాతీయ వార్తలు

ఉప రాష్ట్రపతి కృషితో కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చొరవ మూలంగా ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు అభివృద్దికి మార్గం సుగమమైంది. కృష్ణపట్నం పోర్టు అభివృద్దికి అవసరమైన 758.39 ఎకరాల సాల్ట్ లాండ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టుల విభాగానికి బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టుల విభాగానికి భూమి బదలాయింపునకు అనుమతిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ సాల్ట్ కమీషనర్ ఆర్గనైజేషన్‌కు లేఖ రాసి దాని ప్రతిని వెంకయ్య నాయుడుకు పంపించారు. వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి నుండి కృష్ణపట్నం పోర్టుకు సాల్ట్ భూమి బదలాయింపు కోసం కృషి చేస్తూండటం తెలిసిందే. సాల్ట్ లాండ్‌కు డీపీఐఐటీ నిర్ధారించిన దాని ప్రకారం మార్కెట్ ధరను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.
మాతృ భాషకు రక్షణ
ప్రజాభిప్రాయాన్ని కూడగట్టటం ద్వారానే మాతృభాషల పరిరక్షణకు మార్గం సుగమం అవుతుందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సూచించారు. ప్రముఖ కన్నడ సాహిత్యకారులు, సరస్వతీ సమ్మాన్ అవార్డు గ్రహిత, సాహిత్య అకాడమీ జాతీయ ప్రొఫెసర్ ఎస్‌ఎల్ బైరప్ప, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, జానపీఠ్ అవార్డు గ్రహిత చంద్రశేఖర్ కంబార బుధవారం వెంకయ్య నాయుడును ఉప రాష్ట్రపతి నివాసంలో కలిసి వివిధ రాష్ట్రాల్లో మాతృ భాషకు ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించారు. ప్రాథమిక విద్యాభ్యాసం మాతృ భాషలో జరగవలసిన అవసరం ఎంతో ఉన్నదని వెంకయ్యనాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఆంగ్ల భాషా మాద్యమాలను ప్రోత్సహించటం పట్ల వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లో భారతీయ భాషలను పరిరక్షించాల్సిన అవసరం ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు. ప్రాథమిక స్థాయి లేదా ఎనిమిదో తరగతి వరకు విద్యా బోధన మాతృ భాషలో జరగాలని వెంకయ్య నాయుడు సూచించారు. ప్రాథమిక విద్యాబోధన మాతృ భాషలో జరగాలని యునెస్కో కూడా అభిప్రాయపడటాన్ని వారు పేర్కొన్నారు. మాతృ భాషలో విద్యా బోధన జరిగేందుకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టవలసిన అవసరం ఉన్నదని వారు చెప్పారు.