జాతీయ వార్తలు

మూడు తలాక్‌లతో మహిళలకు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, అక్టోబర్ 18: ఇస్లాం సంప్రదాయంలో మూడు తలాఖ్‌ల విధానం ఆ మతంలోని మహిళలకు నష్టం కలిగిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మూడు తలాఖ్‌ల విధానంపై న్యాయ కమిషన్, సుప్రీం కోర్టు ప్రజాభిప్రాయాన్ని కోరిందని ఆయన అన్నారు. మూడు తలాఖ్‌ల విధానం మహిళల ప్రయోజనాలకు వ్యతిరేకమైందని, ఇది రద్దు కావాలని ఆయన అన్నారు. ‘ఇది ప్రభుత్వ విధానం, ఇందులో ఎలాంటి బేషజాలకు తావులేదు. మహిళలకు హానికలిగించేదని స్పష్టంగా చెప్తున్నాం’ అని వెంకయ్య అన్నారు. వివిధ ముస్లిం సంస్థలు, నేతలు, అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డులు షరియా చట్టాన్ని మార్చటానికి వీల్లేదని తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తున్న నేపథ్యంలో కేంద్ర సమాచార శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న వెంకయ్య వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశంలో 90శాతం ముస్లిం మహిళలు షరియా చట్టానికి మద్దతునిస్తున్నారని పర్సనల్ లాబోర్డు సభ్యుడు జఫార్‌యాబ్ జిలానీ ఇటీవల పేర్కొన్నారు. మూడు తలాఖ్‌లు, నికా హలాలా వంటి విధానాలను వ్యతిరేకిస్తూ లింగ వివక్ష, లౌకికవాదం దృష్టిలో వీటిని పున:సమీక్షించాల్సిన అవసరం ఉందని కేంద్ర శాసన, న్యాయ మంత్రిత్వ శాఖ సుప్రీం కోర్టుకు అక్టోబర్ 7న సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.