జాతీయ వార్తలు

‘బిల్లు’పై భగ్గుమన్న ఈశాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి/అగర్తలా/ఇటానగర్, డిసెంబర్ 10: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఈశాన్య భారతం ఒక్కసారిగా భగ్గుమంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలతో విద్యార్థి సంఘాలు, వామపక్ష ప్రజాస్వామ్య సంస్థలు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కాయి. అఖిల అస్సాం విద్యార్థి సంఘం, ఈశాన్య విద్యార్థి సంస్థ బంద్‌కు పిలుపునివ్వడంతో అస్సాం బ్రహ్మపుత్ర లోయ ప్రాంతం మంగళవారంనాడు స్తంభించిపోయింది. దీనికి వామపక్ష అనుబంధ సంస్థల బంద్ పిలుపు తోడు కావడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గౌహతిలో అనేకచోట్ల భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. అస్సాంలోని సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల వద్ద ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య సంఘర్షణ వాతావరణం నెలకొంది. తమ ఊరేగింపును భద్రతా దళాలు అడ్డుకోవడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. డిబ్రుఘర్ జిల్లాలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి, బంద్ అనుకూల వర్గాలకు మధ్య తోపులాట జరిగింది. అనేకచోట్ల ఉద్యోగులు తమ విధులకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. దీని కారణంగా కూడా ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులు రైలు పట్టాలపై బైఠాయించడంతో అస్సాం అంతటా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. బంద్ కారణంగా మంగళవారం జరగాల్సిన పరీక్షలను విశ్వవిద్యాలయాలు రద్దు చేశాయి. త్రిపురలో ఆందోళనకారులు ఓ మార్కెట్‌ను తగులబెట్టారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, వెంటనే మంటలను అదుపులోకి తెచ్చామని పోలీసులు తెలిపారు. ఈ మార్కెట్ ప్రాంతాల్లో దుకాణాల్లో జరిగిన గిరిజనేతర యజమానుల్లో ఈ ఘటన కారణంగా భయాందోళనలు ఏర్పడ్డాయి. త్రిపురలో అనేక జిల్లాల్లో బంద్ కారణంగా జనజీవనం స్తంభించింది. అలాగే రైలు సర్వీసులు, వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. ఉద్యోగులు ఎవరూ బయటకు రాకపోవడంతో అన్ని కార్యాలయాల్లో హాజరీ అతి తక్కువగా నమోదైంది. త్రిపురలో మొబైల్ డేటా, ఎస్‌ఎమ్‌ఎస్ సర్వీసులను నిలిపివేశారు. అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థి సంఘం పిలుపుమేరకు రాష్టవ్య్రాప్తంగా బంద్ జరిగింది. విద్యా సంస్థలు, బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, మార్కెట్లు ఏవీ పనిచేయలేదు. దాదాపు రోడ్లన్నీ బోసిపోయాయి. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో కనీస పక్షంగా కూడా హాజరీ నమోదు కాలేదు. అలాగే మణిపూర్‌లో కూడా బంద్ ప్రభావం తీవ్రంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ వివాదాస్పద పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని అఖిల మణిపూర్ విద్యార్థి సంఘం హెచ్చరించింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో బంద్ విధ్వంసానికి దారితీసింది. అనేకచోట్ల ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు.