జాతీయ వార్తలు

నేడే నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ48 రాకెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ( ఇస్రో) నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)నుండి రెండువారాల వ్యవధిలో మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట మొదటి ప్రయోగ వేదిక నుండి పీఎస్‌ఎల్‌వీ-సీ48 రాకెట్ ప్రయోగం బుధవారం మధ్యాహ్నం 3గంటల 25నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లేందుకు షార్ శాస్త్ర వేత్తలు సర్వం సిద్ధం చేశారు. సోమవారం జరగవలసిన ఎంఆర్‌ఆర్ సమావేశం కొన్ని అనివార్య కారణాల వల్ల మంగళవారం నిర్వహించారు. సమావేశం అనంతరం రాకెట్ కౌంట్‌డౌన్ నిర్ణయించిన సమయం సాయంత్రం 4గంటల 40నిమిషాలుగా నిర్ధారించి కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. నిర్విరామంగా 22గంటల 45నిమిషాలపాటు కౌంట్‌డౌన్ సాగుతుంది. అనంతరం బుధవారం మధ్యాహ్నం 3గంటల 25నిమిషాలకు నింగిలోకి రాకెట్ ప్రయోగం జరుగుతుందని షార్ వర్గాలు తెలిపాయి. ఈ రాకెట్ ద్వారా భారత భూపరిశీలన ఉపగ్రహం ఆర్‌ఐశాట్-2బి ఆర్ 1 తోపాటు మరో 9 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సిరీస్‌లో ఇది 50వ ప్రయోగం కావడం వలన ఎంతో ప్రాధాన్యత
సంతరించుకుంది. ఈ రాకెట్ ద్వారా జపాన్, ఇటలీ, ఇజ్రాయిల్‌కు చెందిన ఒక్కొక్క ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన 6 ఉపగ్రహాలను రాకెట్ శీర్షభాగంలోని హీట్ షీల్డ్‌లో అమర్చారు. ఈ ఏడాది శ్రీహరికోట నుండి ప్రయోగించిన ప్రయోగాలలో పిఎస్‌ఎల్‌వి-సి48 రాకెట్ 6వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ సిరీస్ రాకెట్లతో వరుస విజయాలతో దూసుకపోతున్న షార్ శాస్తవ్రేత్తలు ఈ రాకెట్‌ను కూడా ప్రయోగించి వాణిజ్య లాభాలు ఆర్జించేందుకు ఇస్రో అన్ని విధాలా సిద్ధమైంది. ఇస్రోలోని యాంత్రిక్స్ సంస్ధ వాణిజ్య పరంగా ఒప్పందం చేసుకుని 239 విదేశీ ఉపగ్రహాలను పంపి 6,280కోట్ల రూపాయల రాబడి సాధించి రికార్డును సృష్టించింది. 20 ఏళ్లలో కక్ష్యలోకి 310 విదేశీ ఉపగ్రహాలను పంపిన ఘనత కూడా ఇస్రో సొంతం చేసుకుంది.
ఇప్పటి వరకు 49 పీఎస్‌ఎల్‌వీ సిరీస్ వాహక నౌకలు నింగిలోకి పంపి వున్నారు. ఇందులో 46 విజయవంతంకాగా రెండు విఫలమయ్యాయి. ఒకటి పాక్షికంగా విజయవంతం అయింది. మొదటి పీఎస్‌ఎల్‌వీ వాహక నౌక షార్‌నుండి 1993 సెప్టెంబర్ 20న ప్రయోగించారు. ఇది విఫలమైంది. మూడోతరం రాకెట్‌గా వచ్చిన పీఎస్‌ఎల్‌వీ వాహక నౌకలను మొదట్లో వరుసగా పీఎస్‌ఎల్‌వీ-డీ 1, పీఎస్‌ఎల్‌వీ-డీ 2. పిఎస్‌ఎల్‌వి-డి 3 పేరుతో నింగిలోకి పంపారు. ఆ తరువాత నుండి పీఎస్‌ఎల్‌వీ-సీ 1 సిరీస్‌తో ప్రయోగాలు చేపట్టారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 13వ నెంబరు వాహక నౌక ప్రయోగం చేపట్టలేదు. నాలుగు సరిసంఖ్య కావడంతో సెంటిమెంట్‌తో ఆ ప్రయోగం చేపట్టలేదు. 2009 ఏప్రిల్ 20న పీఎస్‌ఎల్‌వీ-సీ12 ప్రయోగం చేపట్టిన తరువాత పీఎస్‌ఎల్‌వీ-సీ13 ప్రయోగించాల్సి వుంది. కాని ఈ పేరుతో వాహక నౌక రూపకల్పన చేయకుండా పీఎస్‌ఎల్‌వీ-14 వాహక నౌకను నింగిలోకి పంపి విజయవంతం చేశారు. పీఎస్‌ఎల్‌వీ రికార్డులు పరిశీలిస్తే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికలు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ11 ద్వారా 2008 అక్టోబర్ 22న చంద్రయాన్-1, పీఎస్‌ఎల్‌వీ-సీ25 ద్వారా 2013 నవంబర్ 5న మంగళయాన్ ఉపగ్రహాలను షార్ రాకెట్ కేంద్రం నుండి నింగిలోకి విజయవంతంగా శాస్తవ్రేత్తలు పంపారు. పీఎస్‌ఎల్‌వీ-సీ37 వాహక నౌకద్వారా ఒకే సారి 104 ఉపగ్రహాలను వివిధ కక్ష్యలలోకి ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డు సాధించారు. వాణిజ్యపరంగా పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఇప్పటివరకు 310 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన ఘనత ఇస్రో తన ఖాతాలో వేసుకుంది.
*చిత్రం...షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై నింగిలోకి
దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్న పీఎస్‌ఎల్‌వీ-సీ 48 రాకెట్