జాతీయ వార్తలు

ఆడిట్ నివేదిక రానీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ నివేదికలను పంపించనందుకే పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయటం నిలిపి వేశామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ పునరుద్ఘాటించారు. మంగళవారం రాజ్యసభలో నదీ జలాల సమస్యపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచందర్‌రావు తదితర సభ్యులు ఇచ్చిన సావధాన తీర్మానంపై చర్చ సందర్భంగా షేకావత్ ఈ విషయం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్చును యాభై ఐదు వేలుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరించిన అంచనాలను కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ కోరిన వివరణలను రాష్ట్ర ప్రభుత్వం పంపించనంత వరకు ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ.55 వేల కోట్లుగా భావించలేమని షేకావత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్చులకు సంబంధించిన ఆడిట్ నివేదికలు పంపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరామని, ఈ ఆడిట్ నివేదికలు రానంత వరకు పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయలేమని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు రూ.3 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆడిట్ నివేదికలను కేంద్రానికి పంపించిందని ఆయన చెప్పారు. రామచందర్‌రావు డిమాండ్ చేసిన విధంగా నదీ జలాల అంశాన్ని ఉమ్మడి జాబితాలోకి తీసుకురావడం కూడా కుదరదని ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. రాజ్యాంగ నిపుణులు అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తరువాతనే నదీ జలాల అంశాన్ని రాష్ట్ర జాబితాలో పెట్టారు, ఇప్పుడు దీనిని కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి జాబితాలోకి తీసుకురావటం ఎంత మాత్రం కుదరదు, దీనిని ఉమ్మడి జాబితాలో పెట్టటం తమ ప్రభుత్వ విధానం కాదని షేకావత్ ప్రకటించారు. నదీ జలాల అంశాన్ని రాష్ట్ర జాబితాలో కొనసాగించాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ విధానమని
ఆయన తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం భూగర్భ జలాల టేబుల్‌ను పెంచేందుకు, నీటిని పొదుపు చేసేందుకు గత ఐదు సంవత్సరాల్లో ముప్పై వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని ఆయన చెప్పారు. జలాలను సమర్థంగా ఉపయోగించుకుంటే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. అతి తక్కువ వర్షం కురిసే ఉత్తర రాజస్తాన్‌లో ఇంత వరకు ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదన్నారు. జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించటం లేదని షేకావత్ విమర్శించారు.
తొలుత రామచందర్‌రావు మాట్లాడుతూ దేశం ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేయాలి తప్ప నీటి పారుదల శాఖ పేరును జలశక్తిశాఖగా మారిస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రాణం లాంటిదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేశారన్నారు. విభజన హామీ మేరకు ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాల్సి ఉందని, కానీ కేంద్రం ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తోందన్నారు. పునరావాసం కోసం రూ.16 వేల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజప్తి చేశారు, ఆయన విజప్తి మేరకు వెంటనే నిధులు విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయి రెడ్డి కోరారు. పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని, దీని కోసం కేంద్రం నుంచి నిధుల విడుదల సక్రమంగా జరగాలని ఆయన విజప్తి చేశారు. గత ప్రభుత్వం పోలవరం కాంట్రాక్టర్లకు 2,343 కోట్ల రూపాయలను అదనంగా చెల్లించిన విషయం నిజమేనా? నవయుగ సంస్థకు 787 కోట్ల రూపాయలను ముందస్తుగా చెల్లించినట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్దారించింది, ఈ అక్రమ చెల్లింపులను నవయుగ నుండి రాబట్టేందుకు జలశక్తి మంత్రిత్వ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటోందని విజయయి రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ మనకు ఎదురవుతున్న జల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అన్ని జాతీయ ప్రాజెక్టులను వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని విజప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోతే పోలవరం ప్రాజెక్టు 2021 నాటికి ఎలా పూర్తి అవుతుందని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. గత ఆరు నెలల నుండి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు నిలిచిపోవటానికి ఎవరు కారణమనేది చెప్పాలని బీజేపీ సభ్యుడు సీఎం రమేష్ ప్రశ్నించారు. అకస్మాత్తుగా కాంట్రాక్టరును ఎందుకు మార్చారని ఆయన నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుపై పలు ఆరోపణలు వస్తున్నాయని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఆరు నెలల నుంచి పోలవరం నిర్మాణం పనులను నిలిపివేసిందని తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు. అదనపు చెల్లింపులు జరిగాయనటం ఎంత మాత్రం నిజం లేదన్నారు. ఆరోపణల దృష్టా కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణం పనులను తమ చేతుల్లోకి తీసుకుంటుందా? అని రవీంద్రకుమార్ అడిగారు.