జాతీయ వార్తలు

ఆదిలాబాద్ అభివృద్ధికి తోడ్పడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి సంబంధించిన పదకొండు డిమాండ్లతో కూడిన ఒక వినతిపత్రాన్ని బీజేపీ ఆదిలాబాద్ నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు సోయం బాపూరావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అందజేశారు. సోయం బాపురావుతోపాటు బీజేపీ కోఆర్డినేటర్ నూనె బాలరాజు, ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పాయల్ శంకర్, నిర్మిల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు పి.రమాదేవి తదితర నాయకులు మంగళవారం పార్లమెంటు ఆవరణలో నరేంద్ర మోదీని కలిసి జిల్లా అభివృద్ధికి అవసరమైన చర్యల గురించి వివరించారు. సిసిఐ సిమెంట్ కార్మాగారాన్ని వెంటనే ప్రారంభించాలని మోదీని కోరారు.రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఉట్నూరులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.జిల్లా యువత కోసం ఆసిఫాబాద్‌లో ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ వరకు రైల్వే లైనను నిర్మించాలని, ఆదిలాబాద్‌లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు. జిల్లా అభివృద్ధికి 280 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని మోదీకి స్పష్టం చేశారు.ఆదిలాబాద్, నిర్మల్‌లో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ముదోల్, ఆదిలాబాద్‌లో రెండు టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయటంతోపాటు లంబాడాలను ఎస్‌టి జాబితా నుండి తొలగించాలని సోయం బాపురావు ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఆదిలాబాద్‌లోని బాసరలో ఉన్న సరస్వతీ దేవాలయాన్ని సందర్శించాలని వారంతా నరేంద్ర మోదీని కోరారు. సరస్వతీ దేవాయం ప్రాశస్త్యం, ప్రాధాన్యతను వారు ప్రధాన మంత్రికి వివరించారు.
*చిత్రం... జిల్లా అభివృద్ధికి సంబంధించిన 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అందజేస్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, బీజేపీ జిల్లా నాయకులు