జాతీయ వార్తలు

పౌరసత్వ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లు వల్ల భారతదేశం రాజ్యాంగ విరుద్ధమైన జాతిస్వామ్యంగా మారే ప్రమాదం ఉందని దాదాపు వెయ్యి మంది శాస్తవ్రేత్తలు, మేధావులు హెచ్చరించారు. ప్రస్తుత రూపంలో ఈ బిల్లును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ తమ సంతకాలతో ఒక ప్రకటనను జారీ చేశారు. మతమే ప్రాతిపదికగా పౌరసత్వాన్ని కల్పించడం అన్నది భారత రాజ్యాంగం వౌలిక స్ఫూర్తికే విరుద్ధమని వీరు స్పష్టం చేశారు. దాదాపు ఏడు గంటల పాటు చర్చ అనంతరం లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రగులుకుంది. ఈ వివాదాస్పద బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే మాత్రం అది కచ్చితంగా శాసన ఉల్లంఘనకు దారితీస్తుందని పౌరహక్కుల కార్యకర్త హర్ష్ మందేర్ అన్నారు. ‘నేను అధికారికంగానే ముస్లిం పౌరుడిగా నమోదవుతాను. ఎన్‌ఆర్‌సీకి ఎలాంటి పత్రాలు సమర్పించను. అంతేకాదు, ఎలాంటి పత్రాలు లేని ముస్లింను ఏవిధంగా శిక్షిస్తారో అదేవిధంగా నన్నూ శిక్షించాలని కోరుతాను’ అని మందేర్ ట్వీట్ చేశారు. ప్రస్తుత ఉన్న రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం ఈ బిల్లు కారణంగా రాజ్యాంగ విరుద్ధమైన జాతిస్వామ్యంగా మారే అవకాశం ఉందని ఈ ప్రకటనపై సంతకం చేసిన మందేర్ అన్నారు. ప్రముఖ విద్యావేత్త రామచంద్ర గుహ కూడా ఈ బిల్లును వ్యతిరేకించడమే కాకుండా హోం మంత్రి అమిత్ షాపై తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు.