జాతీయ వార్తలు

పాక్‌కు వకాల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: మూడు ముస్లిం దేశాలకు చెందిన హిందువులు ఇతర మైనారిటీ ప్రజలకు భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు విషయంలో ప్రతిపక్షాలు పాకిస్తాన్‌కు వకాల్తా పుచ్చుకున్నాయని, వారి భాషలో మాట్లాడుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం పార్లమెంటు అనెక్సీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత దేశ చరిత్ర పుటల్లో పౌరసత్వ సవరణ బిల్లును బంగారు అక్షరాలతో లిఖిస్తారని వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ బిల్లు చారిత్రాత్మికమైనదని, జమ్ముకాశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగించేందుకు ఆర్టిల్ 370ని రద్దు చేయడం వంటి చిరస్మరణీయంగా గుర్తుంచుకునే నిర్ణయమని మోదీ ఆవేశంతో చెప్పారు. మతపరమైన హింస, వివక్ష నుండి తప్పించుకునేందుకు భారత దేశం వచ్చిన హిందువులు, తదితర మైనారిటీలు ఇక్కడ శరణార్థులుగా జీవించడం మంచిదా? అని ఆయన ప్రశ్నించారు. వీరికి శాశ్వత ఉపశమనం కలిగించేందుకే ఎన్డీఏ ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు తెచ్చిందని ప్రధాని వివరించారు. బిల్లు గురించి ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ ఎంపీలను ఆదేశించారు. పార్లమెంటులో బిల్లును నెగ్గించుకోవడంతోపాటు బిల్లుకు సంబంధించిన
అన్ని అంశాలను ప్రజల ముందు పెట్టాలని ఆయన ఎంపీలకు సూచించారు. బిల్లు ముస్లింల హక్కులను హరిస్తుందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నాయంటే, ఆ పార్టీలు పాకిస్తాన్ బాషలో మాట్లాడినట్లేనని మోదీ వ్యాఖ్యానించారు. రైతులు, వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, బడుగు, బలహీన, బీద ప్రజలు, పారిశ్రామికవేత్తలను కలిసి, వారి అభిప్రాయాలను ఆర్థిఖ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలియజేయచేయాలన్నారు. తద్వారా ద్వారా మంచి బడ్జెట్ రూపకల్పనకు తోడ్పడాలని పార్టీ ఎంపీలకు సూచించారు. ‘మీరు ఆందజేసే సమాచారం ఆధారంగానే బడ్జెట్‌కు రూపకల్పన జరుతుంది’ అని ఆయన వారితో అన్నారు. ఇదిలా ఉంటే నరేంద్ర మోదీ ఆదేశం మేరకు బీజేపీ ఎంపీలు కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు నిలబడి కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్పారు. కర్నాటకలో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో యడ్యూరప్ప పనె్నండు మంది శాసన సభ్యులను గెలిపించుకోవటం ద్వారా తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడం తెలిసిందే. యడ్యూరప్ప సాధించిన ఈ ఘనతకు గుర్తింపుగా ఆయకు మోదీ ఎంపీలతో స్టాండింగ్ ఒవేషన్ ఇప్పించారు. బీజేపీ ఎంపీలు అంతకు ముందు రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల పాలనను పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీకి కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

*చిత్రం...కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, థావర్ చంద్ గెహ్లాట్‌తో కలిసి బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ