జాతీయ వార్తలు

పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: కేంద్ర ప్రభుత్వం అనుకున్నది సాధించింది. పాకిస్తాన్, బాంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో మత హింసకు గురై భారత దేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలకు భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన చారిత్రాత్మిక పౌరసత్వ సవరణ బిల్లును నెగ్గించుకుంది. ఇంతకు ముందే లోక్‌సభ ఆమోద ముద్ర వేసిన ఈ బిల్లును రాజ్యసభ బుధవారం ఎనిమిది గంటల చర్చ అనంతరం ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు పడగా ప్రతికూలంగా 105 ఓట్లు పడ్డాయి. సవరణ బిల్లును లోక్‌సభలో బలపరిచిన శివసేన రాజ్యసభలో వాకౌట్ చేసింది. ఇదిలావుంటే, సవరణ బిల్లుకు ప్రతిపక్షాలకు చెందిన కొందరు సభ్యులు కూడా మద్దతు ఇవ్వటం గమనార్హం. ప్రతిపక్షం సభ్యులు అనుకూలంగా ఓటు వేయడం వల్లనే సవరణ బిల్లుకు 125 ఓట్లు పడ్డాయన్నది వాస్తవం. పౌరసత్వ చట్టం సవరణ బిల్లును లోక్‌సభ రెండు రోజుల క్రితం పనె్నండు గంటల చర్చ అనంతరం అర్థరాత్రి ఆమోదించడం తెలిసిందే. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లు ఇక్కడి నుండి రాష్టప్రతి రాంనాథ కోవింద్ ఆమోదం కోసం వెళుతుంది. ఆయన ఆమోద ముద్ర పడగానే చట్ట రూపాన్ని ధరిస్తుంది. నిజానికి పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదిస్తుందనే విషయం ప్రతిపక్షం సభ్యులు ప్రతిపాదించిన పలు సవరణలు భారీ మెజారిటీతో వీగిపోయినప్పుడే స్పష్టమైంది. అందుకే తృణమూల్ కాంగ్రెస్ పక్షం నాయకుడు డెరిక్ ఒబ్రేన్ తాను ప్రతిపాదించిన పలు సవరణలను ఉపసంహరిచుకోవలసి వచ్చింది. అధికార పక్షానికి సభలో మెజారిటీ ఉన్నదనేది స్పష్టమైన తరువాత, తమ సవరణలపై ఓటింగ్‌కు డిమాండ్ చేయడం అర్థరహితమని ఆయన వ్యాఖ్యానించారు. సభలో ప్రభుత్వానికి మెజారిటీ ఉంటే నీతి, నిజాయితీ ప్రతిపక్షం పక్షాన ఉన్నదని డెరిక్ ఒబ్రేన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు అధికార పక్షం సభ్యులు అభ్యంతరం చెప్పగా రాజ్యసభ ఆధ్యక్షుడు వెంకయ్యనాయుడు స్పందిస్తూ, కనీసం ఈ ఒక్కరోజుకైనా డెరిక్ ఒబ్రేన్‌కు కొంత నిజాయితీ సంతృప్తి ఉండనివ్వండి అని అధికార పక్షం సభ్యులతో చెప్పారు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లుపై పాకిస్తాన్ నాయకులు, మన ప్రతిపక్షాల నాయకుల ప్రకటనలు ఒకే విధంగా ఉన్నాయని అమిత్ షా దుయ్యబట్టారు. పాకిస్తాన్ ప్రదాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పౌరసత్వ సవరణ బిల్లుపై చేసిన ప్రకటన కాంగ్రెస్ నాయకుల ప్రకటన ఒకే విధంగా ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు. జమ్ముకాశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగించే ఆర్టికల్ 370 రద్దు, ఎన్‌ఆర్‌సీ, మెరుపుదాడులు, పౌరసత్వ సవరణ బిల్లుపై పాకిస్తాన్ నాయకుల ప్రకటనలు
మన ప్రతిపక్షం నాయకుల ప్రకటనలు ఒకే రకంగా ఉన్నాయని అమిత్ షా చెప్పగానే ప్రతిపక్షం తీవ్ర స్థాయిలో
అభ్యంతరం తెలిపింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బాంగ్లాదేశ్‌లో హిందువులు, సిక్కుల ఆడపిల్లలను బలవంతంగా ఎత్తుకుపోయి మత మార్పిడి చేస్తున్నారని అమిత్ షా చెప్పారు. పాకిస్తాన్ గురించి మాట్లాడితే మీకెందుకు కోపం వస్తోందని ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్‌లో 480 దేవాలయాల నుండి ఇప్పుడు కేవలం 20 దేవాలయాలు మిగిలాయని ఆయన తెలిపారు. బాంగ్లాదేశ్‌లో హిందు మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందన్నారు. అఫ్గానిస్తాన్‌లో సిక్కుల సంఖ్య రెండు లక్షల నుండి ఐదు వందలకు పడిపోయిందన్నారు. హిందువుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయిందని అమిత్ షా చెప్పారు. బామియన్ బుద్ధ విగ్రహాలను పేల్చివేయటం చూస్తుంటే బౌద్ధుల పరిస్థితి ఏమిటనేది ఊహించుకోవచ్చునని ఆయన తెలిపారు. అఫ్గానిస్తాన్‌లో హిందువులు, సిక్కులు తమ బట్టలపై పసుపు రంగుతో తమ మతాన్ని ప్రకటించటం తప్పనిసరి అని ఆయన తెలిపారు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్‌లో హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులపై కొనసాగుతున్న అత్యాచారాలను వివరించారు. చాలా మందిని బలవంతంగా మతమార్పిడికి గురి చేస్తున్నారని హోం శాఖ మంత్రి చెప్పారు. మన దేశంలో ముస్లింలు అన్ని రకాల పదవులను పొందగలిగారని, పొందుతున్నారని, ముస్లిం దేశాలలోని మైనారిటీలకు ఇలాంటి హక్కులు లేవని ఆయన వివరించారు. పౌరసత్వ సవరణ బిల్లులో పౌరసత్వం ఇచ్చేందుకు వీలు కల్పించాము తప్ప పౌరసత్వం రద్దు చేసేందుకు ఎలాంటి ఏర్పాటు లేదు కాబట్టి ముస్లిం మైనారిటీలు భయపడవలసిన అవసరం ఎంత మాత్రం లేదని అమిత్ షా స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ బిల్లు వర్తిస్తుందని స్పష్టం చేశారు. పౌరసత్వ చట్టం సవరణ బిల్లును ఇతర మైనారిటీలకు వర్తింపజేసేందుకు తమ ప్రభుత్వం వెనకాడదని ఆయన చెప్పారు. ఇతర దేశాలకు చెందిన ముస్లింలు పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకుంటే తప్పకుండా పరిశీలించి, వీలున్న చోట పౌరసత్వం ఇస్తామన్నారు. ముస్లిం మైనారిటీలకు చెందిన 560 మందికి ఇప్పటికే భారతీయ పౌరసత్వం కల్పించాలని అమిత్ షా చెప్పారు. ఇలావుంటే, బిల్లును రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న రాగేశ్ సవరణ బిల్లువీగిపోయింది. రాగేష్ సవరణ బిల్లుకు అనుకూలంగా 92 ఓట్లు పడితే వ్యతిరేకంగా 113 ఓట్లు పడ్డాయి, ఒక సభ్యుడు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇతర ప్రతిపక్షం సభ్యులు ప్రతిపాదించిన సవరణలు కూడా వీగిపోయాయి.