జాతీయ వార్తలు

ఇస్రో ఆఫ్ సెంచరీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, డిసెంబర్ 11 : దేశ సరిహద్దులను అనుక్షణం పహరా కాస్తూ సైనిక నేస్తానికి అత్యంత ఆధునికమైన రీశాట్-2బీ ఆర్ 1 నిఘా నేత్రం ఉపగ్రహాన్ని బుధవారం గగన తలంలోని నిర్ణీత కక్ష్యలోకి చేరింది. ఇస్రోకు నమ్మిన బంటు పీఎస్‌ఎల్‌వీ-సీ48 రాకెట్ ద్వారా మనదేశ ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన 6 ఉపగ్రహాలు ఉండగా ఇజ్రాయిల్, ఇటలీ, జపాన్ దేశాలకు చెందిన ఒక్కొక్క ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చి శాస్తవ్రేత్తల్లో ఉన్న నమ్మకాన్ని మరోమారు నిలబెట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం 4గంటల 40 నిమిషాలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిర్విరామంగా 22గంటల 45నిమిషాల పాటు జరిగి బుధవారం మద్యాహ్నం 3 గంటల 25నిమిషాలకు చేరుకోగానే నారింజరంగుతో నిప్పులు విరజిమ్ముతూ గగనతలంలోకి దూసుకెళ్లింది. షార్ శాస్తవ్రేత్తలు నిర్ణయించిన కాలమానం ప్రకారం 21 నిమిషాల 19 సెకన్లకు ప్రయోగం సూపర్ సక్సెస్ కావడంతో షార్ శాస్త్ర వేత్తల్లో ఆనందం కట్టలు తెంచుకున్నాయి. ఇస్రో అంతరిక్ష రేస్‌లో ఓ కీలక మైలురాయిని అధిగమించిది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 50వ అంతరిక్ష వాహన నౌకగా ప్రయోగించినట్లైంది. శ్రీహరికోటనుండి ప్రయోగించిన 75వ వాహక నౌక ఇది. ఇక వాణిజ్యపరంగా ఇస్రో 319 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యకు చేర్చింది. సీ 47 ప్రయోగంతో 300 మార్కులు దాటి 310కి చేరింది. ఇస్రో
ఈ సారి మరో 9 విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ 48ద్వారా నింగిలోకి పంపింది. ఇప్పటి వరకు ఇస్రోకు వాణిజ్యపరంగా పెద్ద వినియోగదారుడు అమెరికానే. ఆ దేశానికి చెందిన 233 చిన్న ఉపగ్రహాలను రోదసి లోని కక్ష్యలోకి చేర్చింది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 13 కనపడదు. ఎందుకంటే ఇస్రోకూడా కొన్ని చిన్నచిన్న నమ్మకాలను అనుసరిస్తోంది. ఇది పీఎస్‌ఎల్‌వీకి 50వ ప్రయోగం కాని ప్రస్తుత ప్రయోగ నౌక సంఖ్య సీ48 మరి మిగిలిన వన్ని ఎప్పుడు ప్రయోగించారన్నదే సందేహం అందరిలో ఉంటుంది. వీటిలో మూడు నౌకలను డీ సిరీస్‌లో ప్రయోగించారు. పీఎస్‌ఎల్‌వీ-డీ 1 ప్రయోగం విఫలమైంది. నాల్గవ ప్రయోగం నుండి సీ సిరీస్ మొదలైంది. సీ అంటే కమర్షియల్ అని అర్ధం. ఈ సీ సిరీస్‌లో 13వ నంబర్ ఉండదు. 13అనే సంఖ్య మంచిది కాదనే నమ్మకంతో ఇస్రో ఈ నంబర్‌ను తప్పించింది. నాసా కూడా అపోలో-13 ప్రయోగం విఫలం అయ్యాక ఇక ఏ నౌకలోనూ 13 అనే నంబర్‌ను జోడించలేదు. ఇస్రో కూడా అందుకే ఈ సంఖ్యను వదిలేసింది. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్‌డౌన్ ప్రక్రియ మంగళవారం సాయంత్రం 4గంటల 40నిమిషాలకు ప్రారంభమైంది. ఇస్రో వర్గాలు ముందుగా నిర్ణయించిన కౌంట్‌డౌన్ సమయం 4గంటల 25నిమిషాలకు కావల్సి ఉండగా రాహుకాలం కావడంతో 15నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించాలని రాకెట్ సన్నద్ధత లాంచ్ ఆధరైజేషన్ బోర్డ్ సమావేశంలో నిర్ణయించారు. రాహుకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కౌంట్‌డౌన్ ఆలస్యంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇస్రోలో చాలా ప్రయోగాలకు ముందు తిరుమలలోని వెంకటేశ్వరస్వామిని, సూళ్ళూరుపేటలోనిచెంగాళమ్మ దేవిలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇది కూడా ఒక సెంటిమెంట్‌గా మారింది.
50 ప్రయోగాల్లో కేవలం రెండే వైఫల్యాలు
పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ఇస్రో వాణిజ్య విభాగానికి వెనె్నముక వంటిది. దిగువ భూకక్ష్యలో వాణిజ్య ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం దీని ప్రత్యేకత. దీనిలో తొలిరాకెట్‌ను 20సెప్టెంబర్ 1993లో ప్రయోగించారు. ఇది లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. ఆ తరువాత దాదాపు 36 ప్రయోగాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ రోదసిలోకి చేర్చేందుకు ప్రయోగించిన సి39 విఫలమైంది. ఇది 2017లో జరిగింది. ఆ తరువాత మళ్ళీ ఇస్రోకు పి ఎస్ ఎల్‌వి నుంచి ఎటువంటి వైఫల్యాలు ఎదురు కాలేదు. పీఎస్‌ఎల్‌వీ పేరిట మరోఘనత వుంది. సీ 37 ప్రయోగంలో ఒకే సారి 104 చిన్న ఉపగ్రహాలను రోదసి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మరి ఏ ఇతర అంతరిక్ష ప్రయోగ సంస్ధ ఇప్పటి వరకు ఈ ఘనతను సాధించలేదు.
దేశానికి మరో నిఘా నేత్రం
ప్రస్తుత ప్రయోగంలో అంతరిక్షంలోకి పంపిన 2 బీఆర్ 1 భారత్‌కు నిఘా నేత్రంగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఇస్రో రీశాట్ సిరీస్‌లో కొన్నిటిని ప్రయోగించింది. భారత సైనిక దళాలకు కొన్ని ప్రదేశాలలో నిరంతర నిఘా కోసం 4వరకు రీశాట్ సిరీస్ ఉపగ్రహాలు అవసరం. వీటిలోని ఎక్స్ బాండ్, సింధటిక్ అపార్చర్ రాడార్‌నుండి స్పష్టమైన చిత్రాలు లభిస్తాయి. పగలు, రాత్రి మేఘావృతమైన వాతా వరణంలో కూడా మంచి ఫిల్టర్లను వినియోగించి నాణ్యమైన చిత్రాలను అందిస్తాయి.
సైనికదళాలకు కళ్లు..చెవులుగా ఇస్రో
ఇప్పటికే ఇస్రో భారత రక్షణకు ఎనలేని సేవలు అందిస్తోంది. భారత్‌కు కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్జ్, ఇంటలిజెంట్స్, సర్వేలైన్స్ అండ్ రికాని సన్స్( సి4 ఐ ఎస్ ఆర్ ) సామర్ధ్యాలను బలోపేతం చేసుకోవడంలో ఇస్రో చేదోడు వాదోడుగా వుంటుంది. గతంలో భారత్ అర్ధ రాత్రి నిర్వహించిన మెరుపు దాడుల్లో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు కీలక పాత్ర పోషించాయి. గత నెలలో ప్రయోగించిన కార్టోశాట్-3లోని కెమెరా 0.25 సెంటీమీటర్ల రిజల్యూషన్‌తో అత్యంత స్పష్టమైన చిత్రాలు తీయగలదు. అంటే మనశత్రు స్ధావరాలలో వున్న చిన్న పరికరాల సమాచారంతో సహా మనం కనుక్కోవచ్చు. చాలా అమెరికా ఉపగ్రహాల సామర్ధ్యం కంటే ఇది ఎక్కువ. ఈ రకంగా ఇస్రోలో పనిచేస్తున్న 17వేల మంది ఉద్యోగులు దేశ సేవలో పాలుపంచుకున్నట్లే. దేశీయ జిపి ఎస్ గా పేరున్న నావిక్ వ్యవస్ధను కూడా ఇస్రో అందుబాటులోకి తెచ్చింది. ఇది అమెరికా జీపీఎస్ కంటే అత్యంత ఖచ్చితత్వంతో ఉన్న ప్రదేశాన్ని వెల్లడించగలదు. యుద్ద సమయంలో శత్రుదేశాలు భారత్‌లోని జీపీఎస్ వ్యవస్ధ సంకేతాలను నిలిపివేస్తే నావిక్ సంకేతాలు అక్కరకు వస్తాయి.
పీఎస్‌ఎల్‌వీకి తోడుగా మరో చిన్న రాకెట్ సిద్దం
మరోవైపు పీఎస్‌ఎల్‌వీ కంటే తక్కువ సామర్ధ్యం వున్న స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహీకల్ ( ఎస్‌ఎస్‌ఎల్‌వీ) ని యుద్ధ ప్రాతిపదికన భారత్ అభివృద్ధి చేస్తోంది. దీని సామర్ధ్యం 300-500 కిలోల మధ్య ఉండవచ్చని అంచనా. దీన్ని త్వరలోనే ప్రయోగిస్తామని కార్టోసాట్ 3 ప్రయోగం సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్ వెల్లడించారు. చిన్న రాకెట్‌గా వ్యవహరించే దీని ప్రయోగం విజయవంతమై అందుబాటులోకి వస్తే ఇస్రో ఖర్చు గణనీయంగా తగ్గడంతో పాటు మరింత చౌకగా ఉపగ్రహాలను ప్రయోగించడానికి అవకాశం ఏర్పడుతుంది. వాణిజ్య అవసరాల దృష్ట్యా దీన్ని ప్రయోగించడం అత్యంత సులువుగా ఉండేలా ఇస్రో జాగ్రత్తలు తీసుకుంటుంది. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాన్ని సిద్ధం చేయడానికి ప్రాజెక్టునుబట్టి రెండు నెలల వరకు సమయం పడుతుంది. దీనికి ఏర్పాట్లు భారీగానే ఉంటాయి. అదే ఎస్ ఎస్ ఎల్‌వికి ఇందులో 4వ వంతుకంటే తక్కువ సమయం సరిపోతుంది. ఖర్చు పరంగా చూసుకున్నా కేవలం 30కోట్ల రూపాయలతో ప్రయోగం పూర్తిచేయవచ్చు. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి కనీసం 600మంది ఉద్యోగులు అవసరం అవుతారు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి 10మందిలోపే బృందం చాలు. యాంత్రిక్స్ అంచనా ప్రకారం వచ్చే పదేళ్ళలో ఏటా 60 వరకు చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం వుంది. పి ఎస్ ఎల్‌వి-సి 48 రాకెట్ విజయ వంతం కావడంతో షార్ శాస్తవ్రేత్తలకు ఇస్రో అధిపతి డాక్టర్ శివన్ అభినందనలు తెలియచేశారు. మిషన్ డైరెక్టర్లు తమతమ అభిప్రాయాలను విజయవంతానికి కారకులైన ఉద్యోగులను కొనియాడారు.

*చిత్రాలు.. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకువెళ్తున్న పిఎస్‌ఎల్‌వి రాకెట్
*ఇస్రో చైర్మన్ శివన్ (ఇన్‌సెట్‌లో)