సంపాదకీయం

‘పెప్సి’ పెత్తనం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్‌లో వ్యవసాయదారులపై ‘పెప్సి’ వాణిజ్య సంస్థ ‘జులుం’ చేస్తుండడం ఒక ఉదాహరణ..! చరిత్ర పునరావృత్తం అవుతోంది.. విదేశీయ సంస్థలు స్వదేశీయ ఆర్థిక వ్యవస్థను నియంత్రించడం, నిర్దేశించడం ఈ పునరావృత్తి! ‘పెప్సి’- అనే ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’వారు గుజరాత్‌లో ఆలుగడ్డ- బంగాళాదుంప, ఉర్లగడ్డ-ల వ్యవసాయాన్ని నియంత్రిస్తుండడం పునరావృత్త చరిత్రలో నడుస్తున్న ఘట్టం! ఈ ‘పెప్సి’ సంస్థకు మన దేశంలో భాగం ఏర్పడి ఉంది. దాని పేరు ‘పెప్సికో ఇండియా’. ఉర్లగడ్డలను తరిగి వేయించి ఆ ‘ఉప్పేరి’- చిప్స్-ని అమ్ముతున్న ఈ ‘పెప్సికో ఇండియా’ వ్యాపారం వల్ల దేశంలోని వేల మంది చిన్న ఉత్పత్తిదారుల ఉప్పేరి బట్టీలు మూతపడిపోవడం ‘ప్రపంచీకరణ’వల్ల జరిగిన మేలు. మేలు జరిగింది ‘పెప్సీ’ సంస్థకు..! మన దేశానికి మేలు జరుగుతున్నట్టు మురిసిపోయి ముక్కులెగరేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకులు దశాబ్దుల తరబడి నకిలీ పారవశ్యానికి లోనయి ఉన్నారు! ఈ కుహనా పారవశ్యపు పరదాలలో బందీ అయి ఉన్న భారతీయ బుద్ధికి చరిత్ర పునరావృత్తం అవుతున్న ధ్యాస లేదు. గతంలో క్రీస్తుశకం పదహారవ శతాబ్దిలో అంకురించిన ఐరోపావారి వాణిజ్య విస్తరణ క్రమంగా వాణిజ్య దురాక్రమణగా మారడం ఈ చరిత్ర. వాణిజ్య దురాక్రమణ, రాజకీయ దురాక్రమణగా, భౌతిక దురాక్రమణగా మారడం భారతదేశం ఐరోపా దేశాలకు ‘బందీ’కావడం. భారతీయులు బానిసలు కావడం తరువాత నడిచిన వ్యథ. ‘అంకురం’ బ్రిటన్ దురాక్రమణ రూపంలో మహా విషవృక్షమైంది! బ్రిటన్ విముక్త భారతదేశంలో ఏడు దశాబ్దులకు పైగా పాలకులకు ఈ చరిత్ర నుంచి ‘గుణపాఠం’ ఏర్పడలేదు. అందువల్లనే చరిత్ర పునరావృత్తం అవుతోంది. ఐరోపావారి వాణిజ్య దురాక్రమణకు ఆధునిక విస్తృతి ‘వాణిజ్య ప్రపంచీకరణ’! పదిహేడవ పద్దెనిమిదవ శతాబ్దులలో మన దేశంలో ఆధిపత్యం కోసం బ్రిటన్‌వారి ‘ఈస్టిండియా’ కంపెనీ, ఫ్రాన్స్ ప్రభుత్వం వారి కంపెనీ యుద్ధాలు చేశాయి. నెగ్గిన బ్రిటన్ దోపిడీ సంస్థ మన దేశంపై పెత్తనం చేసింది! ఇప్పుడు ఒకటికాదు రెండు కాదు వందల విదేశీయ సంస్థలు మన దేశంలో ఆధిపత్య వాణిజ్య యుద్ధాలు సాగించడం పాతికేళ్ల ‘ప్రపంచీకరణ’ ఫలితం! స్వదేశీయ వాణిజ్య సంస్థలను ఈ విదేశీయ వాణిజ్య సంస్థలు దిగమింగేశాయి. ఒక్కొక్క రంగంలో రెండుమూడు విదేశీయ బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు ‘సమాంతర ప్రభుత్వాల’ను నిర్వహిస్తుండడం పాతికేళ్లుగా ‘అధికార రోగ పూరిత బధిరాంధక’ ప్రభుత్వ నిర్వాహకులు గ్రహించని వాస్తవం! ‘అమెజాన్’, ‘వాల్‌మార్ట్’, ‘పెప్సీ’, ‘నెజలే’, ‘మొన్‌సాంటో’, ‘ఉబర్’, ‘పోస్కో’, ‘అరేవా’- వంటివి విదేశీయ వాణిజ్య దురాక్రమణ విజయ పతాకాలు, దోపిడీకి ప్రతీకలు! ఈ దురాక్రమణ చారిత్రక పునరావృత్తి గుజరాత్ వ్యవసాయ రంగంలో కల్లోలాన్ని సృష్టిస్తోంది. అందువల్లనే ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గ్రహిస్తోంది, ‘పెప్సి’కబంధ బంధం నుంచి రైతులను విముక్తిచేయడానికి నడుం బిగించినట్టు ప్రచారం అవుతోంది...
ఈ విదేశీయ ‘పెప్సి’సంస్థవారు గుజరాత్‌లో తాము పండిస్తున్న రకాల ఆలుగడ్డలను ఇతర రైతులు పండించరాదని అనేక ఏళ్లుగా ఆంక్షలను విధించారు. తరతరాలుగా యుగాలుగా స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోగలిగిన రైతులు ఏమి పండించాలన్నది తాము నిర్ణయించుకున్నారు. ప్రభుత్వాలు సైతం ఈ స్వేచ్ఛను హరింపజాలవు. ఆంక్షలను విధింపజాలవు. కానీ అమెరికా, చైనాల నుంచి చొఱబడుతున్న వాణిజ్య సంస్థలు క్రమంగా రైతుల స్వేచ్ఛను, వ్యవసాయ స్వాతంత్య్రాన్ని హరించి వేస్తుండడం నడుస్తున్న చరిత్ర. గతంలో బ్రిటన్ పాలకులు ‘్భమి పన్ను’ను భయంకర పద్ధతులలో వసూలుచేశారు. పంటలు పండని సమయంలో సైతం, కరవుకాటకాలు ఏర్పడిన తరుణంలో సైతం పన్నులను వసూలుచేశారు. చెల్లించలేని రైతుల ఇళ్లలోకి చొఱబడి సర్వస్వం హరించారు, మహిళల మంగళసూత్రాలను సైతం తెంచుకొని పోవడం క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్దినాటి విదేశీయ రాక్షస ‘పాలన’కు చారిత్రక నిదర్శనం. ఇలాంటి బీభత్సకాండకు వ్యతిరేకంగానే పద్దెనిమిదవ శతాబ్దిలో వంగ ప్రాంతంలో ‘సంన్యాసుల విప్లవం’ జరిగింది. ధర్మాచార్యుల నేతృత్వంలో ప్రజలు విదేశీయ దమనకాండకు వ్యతిరేకంగా పోరాడారు. వంద ఏళ్ల తరువాత బంకించంద్రుడు రచించిన ‘ఆనంద మఠం’నవలకు ఆ వాస్తవ ఘటన నేపథ్యం...
‘పనె్నండు దేశాలు పండుచున్న కాని
పట్టెడన్నమె లోపమండీ,
ఉప్పుముట్టుకుంటె దోషమండి!
అయ్యొ! కుక్కలతో పోరాడి
కూడు తింటామండి...
మాకొద్దీ తెల్లదొరతనము
దేవ! మాకొద్దీ తెల్లదొరతనము!’’
... అని తెలుగు సీమలలో బ్రిటన్ వ్యతిరేక ఉద్యమకారులు ఎలుగెత్తడానికి అదంతా నేపథ్యం. ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి- నందన వనంలోకి చొఱపడిన అడవి పందుల వలె- పెప్సి, మొన్‌సాంటో వంటి విదేశీయ సంస్థలు చొఱపడి ఉన్నాయి!
ఉర్లగడ్డలను తరిగి ముక్కలను వేయించడానికి ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ సాధ్యం. ఇందుకోసం ఆర్భాటమైన సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు, అమెరికా నుంచి ఐరోపా నుంచి ‘నెజలే’, ‘పెప్సి’వంటి సంస్థలు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనవసరం. వికేంద్రీకృతమై దేశమంతటా విస్తరించిన చిట్టిపొట్టి వ్యాపారులు, సంచార వర్తకులు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు బంగాళాదుంపలను వేయించి ఉప్పూకారం చల్లి వినియోగదారులకు సరఫరా చేయడం అనాది వ్యవస్థ. ఈ వ్యవస్థను ‘పెప్సి’ సంస్థ భగ్నం చేసింది. వేల మంది స్థానిక వ్యాపారుల ఉత్పత్తిదారుల పొట్టకొట్టింది! ‘వేఫర్స్’- పలుచనివి- ‘లేస్’- పొరలు- అని పేరుపెట్టి ఆలుగడ్డ ముక్కలను వేయించి అమ్మడం మొదలుపెట్టింది, ఉత్పత్తిని ‘కేంద్రీకృతం’చేయడం దోపిడీ చేయడానికి మాధ్యమం. ‘పెప్సి’ ఇలా ‘ఉర్లగడ్డల’ ముక్కల వేపుడు కార్యక్రమాన్ని కేంద్రీకృతం చేసింది. ఈ రంగంలో ఈ సంస్థదే అతిపెద్ద పరిశ్రమ అట! విదేశాల పెట్టుబడులు ఉక్కు, సిమెంటు, విద్యుత్తు, బొగ్గు, ఇంధనం, ఎఱువుల వంటి వౌలిక రంగాలలో మాత్రమే అనుమతించగలమని పాతికేళ్లక్రితం ప్రభుత్వం చెప్పిన మాట! పాతికేళ్ల తరువాత ఈ వౌలిక రంగాలలో ఉత్పత్తులను పెంచడానికి విదేశీయ సంస్థలు పెట్టుబడులను పెట్టడం లేదు. ‘వేఫర్స్’ను, సేమ్యాల- నూడుల్స్-ను ఉత్పిత్తిచేసి అమ్మి లాభాలను తమ దేశాలకు తరలించుకొని పోతున్నాయి!
ఇలా బంగాళాదుంపలను వేయిస్తున్న ‘పెప్సి’ సంస్థ దుంపలను రైతులవద్ద కొనడం మొదటి దశ. ఇప్పుడు ‘తొండ ముదిరి తోడేలు’గా మారింది, వ్యవసాయ క్షేత్రాలలోకి చొఱబడింది. గుజరాత్‌లో దాదాపు పదిహేను వేల ఎకరాలలో ‘పెప్సి’ ప్రతినిధులుగా మారిన రైతులు బంగాళా దుంపలను పండిస్తున్నారట! ‘పెప్సి’ నిర్దేశించిన ‘రకం’ ఉర్లగడ్డలను మాత్రమే ఈ రైతులు పండించాలి. ‘పెప్సి’ సంస్థకే విక్రయించాలి, ‘్ధర’ను ‘పెప్సి’నిర్ణయిస్తోంది. ఇలా ఈ పనె్నండువేల రైతులు ‘పెప్సి’కి కట్టుబానిసలు! ‘పెప్సి’రకాల దుంపలను పండించిన ఎనిమిది మంది రైతులు ‘తమకు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు చెల్లించాలని’ గత ఏడాది ‘పెప్సి’ సంస్థవారు న్యాయస్థానంలో వివాదం దాఖలుచేశారు, రైతుల నిరసనలు చెలరేగడంతో ఆ వివాదాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ సంస్థ అక్రమ ఆధిపత్యాన్ని తొలగించడానికి వీలుగా నిబంధనావళిలో మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించడం హర్షణీయం. కానీ నియంత్రించడం వల్ల ప్రయోజనం లేదు. దేశం నుంచి వెళ్లగొట్టాలి!