జాతీయ వార్తలు

మేమొస్తే రైతులు, వ్యవసాయానికి మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌మహల్/మహాగామా (జార్ఖండ్), డిసెంబర్ 12: జార్ఖండ్‌లో తమ కూటమి అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని, 2,500 రూపాయల కనీస మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో హామీ ఇచ్చారు. ఇప్పటికే తాము అధికారంలో ఉన్న చత్తీసగఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఈ నిర్ణయాలను అమలు చేస్తున్నామని, జార్ఖండ్‌లో కూడా తమకు పట్టం కడితే, రైతులు, వ్యవసాయానికి మేలు కలిగించే పథకాలను చేపడతామని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేఎంఎం, ఆర్‌జేడీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. తమ కూటమికి మెజారిటీని కట్టబెడితే క్వింటాలు ధాన్యానికి 2,500 రూపాయలు కనీస మద్దతు ధరను కచ్చితంగా అందిస్తామని, అలాగే 2 లక్షల రూపాయల వరకు పంట రుణాల మాఫీని ప్రాధాన్యతాపూర్వకంగా తాము అమలు చేస్తామని రాహుల్ తెలిపారు. గతంలో జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో తాము అమలు చేశామని, జార్ఖండ్‌లో కూడా నెగ్గితే మాట నిలబెట్టుకుంటామని ఆయన తెలిపారు. కేంద్రంలో బీజేపీ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని రాహుల్ విమర్శించారు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో నిరుద్యోగ సమస్య యువతను పట్టి పీడిస్తోందని, అలాగే పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల కూడా పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ నిర్ణయ ప్రభావం నుంచి ప్రజలు ఇంతవరకూ కోలుకోలేదని రాహుల్ విమర్శించారు. ఇంత జరిగినా కూడా 10, 15 మంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని రాహుల్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తమకు అధికార పగ్గాలు అప్పగిస్తే నీరు, అడవులు, భూములను పరిరక్షిస్తామని, ఇవి దోపిడీకి గురికాకుండా అడ్డుకుంటామని తెలిపారు. అలాగే, రాష్ట్ర ప్రజలందరికీ మంచినీటిని సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని అన్నారు. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నపుడు 9 శాతం వృద్ధిరేటును సాధించామని, ఇప్పుడు అంతా తలకిందులైందని ఆయన గుర్తు చేశారు.
*చిత్రం...కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ