జాతీయ వార్తలు

తొలగించే చెట్ల స్థానంలో కొత్త చెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రహదార్ల నిర్మాణంలో తొలగిస్తున్న వృక్షాల స్థానంలో కొత్త చెట్ల పెంపకాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభలో స్పష్టం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణాన్ని నిర్దేశిత కాల వ్యవధిలోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం వివిధ స్థాయిల్లో ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన మరో అనుబంధ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ వివిధ కారణాలతో కొన్ని రహదారుల నిర్మాణంలో జాప్యం చోటుచేసుకుంటోందన్నారు. ప్రధానంగా భూసేకరణ, పర్యావరణ, అటవీ, వణ్యప్రాణి సంరక్షణ వంటి వాటికి క్లియరెన్స్‌లు రావడంలో జాప్యం జరగడం ఆలస్యానికి దారితీస్తున్నాయని గడ్కరీ వివరించారు. మరోవైపు కాంట్రాక్టర్ల అసమర్థత కూడా ఇందుకు తోడవుతోందని మంత్రి లిఖిత పూర్వకంగా తెలిపారు. రహదారుల నిర్మాణ సమయంలో వృక్షాల తొలగింపునకు అనుమతులు రాకపోతే నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఆ వృక్షాల స్థానంలో కొత్తగా చెట్లు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
పనుల వేగవంతానికి ఇతర శాఖలతో సమన్వయం
వివిధ జాతీయ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గడ్కరీ వెల్లడించారు. ఇందులో భాగంగా ఇతర మంత్రిత్వ శాఖలతో సమన్వయంతో ముందుకు సాగేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. ఇందువల్ల సమస్యల సత్వర పరిష్కారానికి మార్గం సుగమం అవుతోందన్నారు. ఢిల్లీ-ముంబయి రహదారి ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణలో పరిహారం చెల్లించేందుకు రూ. 11,624 కోట్లు అవసరమవుతాయని ‘కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజేషన్’ (సీఏఎల్‌ఏ) తేల్చిందని మరో ప్రశ్నకు గడ్కరీ సమాధానమిచారు. ఈ మొత్తంలో ఇప్పటికే రూ. 5,378 కోట్ల పరిహార నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని, నిర్వాసితులకు పంపిణీ కూడా జరిగిందని తెలిపారు. పరిహార చెల్లింపును పరిస్థితినిబట్టి సవరించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

*చిత్రం... రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ