జాతీయ వార్తలు

హిమపాతం నుంచి 170 మందికి విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, డిసెంబర్ 14: హిమాచల్ ప్రదేశ్‌లోని కుర్ఫీలో హిమపాతంలో చిక్కుకుపోయిన 170 మంది విద్యార్థులను రక్షించినట్టు పోలీసులు శనివారం వెల్లడించారు. రాష్ట్రంలో మంచు విపరీతంగా కురుస్తోందని పర్యాటకులు అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. శనివారం ఉదయం 170 మంది విద్యార్థులను హిమపాతం నుంచి సురక్షితంగా కాపాడినట్టు సిమ్లా ఎస్పీ ఓంపాటి జామ్వాల్ తెలిపారు. మహారాష్టక్రు చెందిన 90 మంది, రాజస్థాన్‌కు చెందిన 80 మంది పర్యాటక యాత్రకు వచ్చి కుర్ఫీలో మంచులో చిక్కుకుపోయారు. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. మహారాష్ట్ర విద్యార్థులు మనాలీ వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు కుర్ఫీలోని ఫాగు వద్ద హిమపాతంలో దిగబడిపోయింది. సమాచారం అందుకున్న ధాల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజ్‌కుమార్ తన బృందంతో రంగంలోకి దిగి విద్యార్థులను రక్షించారు. వారందర్నీ సమీపంలోని ఓ రిసార్ట్‌కు తరలించాలని, ప్రస్తుతం అక్కడే ఉన్నారని ఎస్పీ స్పష్టం చేశారు. కుర్ఫీ-చర్రాబారా సెక్షన్‌లోని హసన్ వ్యాలీ వద్ద రహదారిని మంచు కప్పేసింది. రాజ్‌కుమార్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి పరిస్థితికి చక్కదిద్దింది. నిలిచిపోయిన 300 వాహనాలను క్రమబద్ధీకరించారు. మంచులో చిక్కుకున్న వాహనాల్లో 80 తేలికపాటి మోటర్ వాహనాలు, రెండు టూరిస్టు బస్సులు ఉన్నట్టు జామ్వాల్ తెలిపారు. రెండు టూరిస్టు బస్సులు హసన్ వ్యాలీకి అర కిలోమీటర్ దూరం వెళ్లి నిలిచిపోయాయి. ఒక బస్సులో రాజస్థాన్‌కు చెందిన విద్యార్థులున్నారు. అందులో 35 మంది విద్యార్థిను ఉన్నట్టు ఎస్పీ పేర్కొన్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఓ బుల్డోజర్‌ను తీసుకెళ్లి రాత్రంగా శ్రమించి మంచును తొలగించారు. 80 మంది విద్యార్థులను నాలుగు ఎస్కార్ట్ వాహనాలతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. సిమ్లాలోని ఛోటా వద్ద గురుద్వారాలో కొందరు, ట్రైబల్ భవన్‌లో మరికొందరికి ఆశ్రయం కల్పించినట్టు ఎస్పీ వెల్లడించారు. పరిస్థితి అనుకూలించిన తరువాత టూరిస్టు బస్సులను గమ్యస్థానాలకు పంపుతామని ఎస్పీ తెలిపారు. ఇలా ఉండగా శనివారం వేకువ జామున ఓ నిర్మానుష ప్రాంతంలో మంచులో చిక్కుకుపోయిన ఓ వాహనాన్ని కనుగొన్నట్టు ఆయన చెప్పారు. వాహనంలో కుటుంబంతో పాటు ఓ వ్యక్తి ఉన్నాడని, డ్రైవర్‌ను పంపుతామన్నా వదలి రావడానికి తిరస్కరించాడని ఆయన అన్నారు. అతి కష్టంమీద ఆ కుటుంబాన్ని సిమ్లా తరలించినట్టు ఎస్పీ వివరించారు. బెఖాల్టీ రహదారిపై ఐదు వాహనాలు చిక్కుకుపోయాయని ఆయన పేర్కొన్నారు. సదార్ పోలీసులు రాత్రంతా శ్రమించి మంచులో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.