జాతీయ వార్తలు

రాహుల్ జిన్నా అనడం సముచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీని ‘రాహుల్ జిన్నా’ అనడం సముచితంగా ఉంటుందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ముస్లింలను బుజ్జగించే రాహుల్ గాంధీకి ఇదే సరైన నామధేయంగా ఉంటుందని ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఢిల్లీ రాంలీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘్భరత్ బచావో ర్యాలీ’లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ తనకు తాను ‘రాహుల్ సావర్కర్’ను కాదంటూ చేసిన వ్యాఖ్యలపై జీవీఎల్ మండిపడ్డారు. రాహుల్ ఎన్ని జన్మలెత్తినా సావర్కర్ కాలేరని అన్నారు. రాహుల్ గాంధీ ‘రాహుల్ జిన్నా’ అవుతారే తప్ప రాహుల్ సావర్కర్ కాలేరని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ సమన్వయంతో ఉండాలని హెచ్చరించారు. హిందుత్వానికి చిహ్నామైన వీర సావర్కర్‌ను ఉద్ధేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. బీజేపీ మరో అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మీడియాతో మాట్లాడుతూ రాహుల్ ఎన్నటికీ రాహుల్ సావర్కర్ కాలేరని అన్నారు.