జాతీయ వార్తలు

ఫరూఖ్ అబ్దుల్లా గృహ నిర్బంధం మరో 3 నెలలు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ నగర్, డిసెంబర్ 14: జమ్మూ-కాశ్మీర్‌కు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఫరూఖ్ అబ్దుల్లా గృహ నిర్భంధాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఆందోళనలు జరిగే ప్రమాదం ఉందని భావించి, ఫరూఖ్ అబ్దుల్లాతో పాటు పలువురు ముఖ్య నేతలను నిర్బంధించిన (హౌస్ అరెస్టు) సంగతి తెలిసిందే. కాగా ఐదు సార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన సీనియర్ పార్లమెంటేరియన్, మాజీ ముఖ్యమంత్రి అబ్దుల్లాను జైలులో కాకుండా ఆయనను హౌస్ అరెస్టు (గృహ నిర్భంధం) చేయడం జరిగింది. ఆగస్టు 5న కేంద్రం జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన రోజునే ఫరూఖ్ అబ్దుల్లాను గృహ నిర్బంధం చేయడం జరిగింది. అయితే ఆయన నిర్బంధంపై విధించిన గడువు ముగిసినందున, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ-కాశ్మీర్‌కు చెందిన హోం శాఖ మరో మూడు నెలల పాటు నిర్బంధాన్ని పొడిగించింది. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ప్రభృతులను కూడా గృహా నిర్భంధం చేశారు.