జాతీయ వార్తలు

అంతర్గత భద్రతపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 14: దేశ అంతర్గత భద్రత విషయంలో రాజీలేదని ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం సమర్ధవంతంగా పనిచేస్తోందని, ప్రధానంగా వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు శనివారం ఇక్కడ వెల్లడించారు. కోల్‌కతాలో జరిగిన ‘ఇండస్ట్రీ డిఫెన్స్ లింకేజీ’ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. పలువురు సైనిక ఉన్నతాధికారులూ హాజరయ్యారు. గతంతో పోలిస్తే చైనా- భారత్ సరిహద్దులో ప్రశాంత వాతావరణం ఉందని ఆయన అన్నారు. గత ఏడాది జరిగిన ఊహన్ కాన్ఫరెన్స్ తరువాత పరిస్థితుల్లో గణనీయమైన ఫలితాలు కనిపించాయని చౌహాన్ పేర్కొన్నారు.‘నాగాలతో చర్చలు త్వరగా ముగించాలన్న పట్టుదలతో కేంద్రం ఉంది. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ విషయంలోనూ కేంద్రం ఆసక్తి కనబరుస్తోంది’ అని ఆయన చెప్పారు. వామపక్ష తీవ్రవాదం సహా పలు అపరిష్కృత సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్టు లెఫ్టినెంట్ జనరల్ తెలిపారు. అక్టోబర్ 31న నాగా గ్రూపులతో చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌తో చర్చించి ఓ శాశ్వత పరిష్కారం చేస్తామని కేంద్రం ఇదివరకే ప్రకటించిందని ఆయన అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక సంపత్తిని మెరుగుపరచుకోవల్సిన అవసరం ఉందని చౌహాన్ వెల్లడించారు. వైమానిక, భూతల నిఘా వ్యవస్థ, రహదారుల నిర్మాణం, కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి సారించినట్టు లెఫ్టినెంట్ జనరల్ తెలిపారు. 464 టీ-90 యుద్ధ ట్యాంకుల కోరుతూ ఆర్మీ లేఖ రాసిందని కోల్‌కతాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు చైర్మన్ హరి మోహన్ వెల్లడించారు. ‘20వేల కోట్ల రూపాయల వ్యయం కాగల ఈ ప్రాజెక్టు నాలుగైదు ఏళ్లలో పూర్తిచేస్తాం’అని ఆయన తెలిపారు. అలాగే ఆర్టినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఆయుధాల రవాణ చేసే 165 బీఎంపీ వాహనాలకు సంబంధించి ఆర్మీ నుంచి ఆర్డర్ అందుకున్నట్టు ఆయన చెప్పారు. వీటికి ఎమిమిది నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని హరి మోహన్ వివరించారు. ‘ 114 దేశవాళీ ధనుష్ శతగ్నులు తయారు చేస్తున్నాం. కేంద్రం 300 ఫిరంగి తుపాకీలు తయారీకి అనుమతి ఇచ్చింది’అని ఆయన తెలిపారు. రక్షణ అవసరాల కోసం ఎక్కువగా విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోందని, దాన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి దిగుమతి చేసుకునే టీ-72, టీ- 90 టాంకులు సాంకేతికపరంగా కొన్ని ఇబ్బందులుంటున్నాయి. రష్యన్ బీఎంపీ వాహనాల రివర్స్ డిజైనింగ్ కారణంగా మొత్తం దేశీయ పరిజ్ఞానంతోనే ఇక్కడ రూపొందిస్తున్నట్టు ఓఎఫ్‌బీ చైర్మన్ వెల్లడించారు. సీఐఐ డిఫెన్స్ సబ్‌కమిటీ చైర్మన్ ఏకే జైన్ మాట్లాడుతూ భారత్ నుంచి రక్షణ పరికరాల ఎగుమతి బాగా పెరిగిందని అన్నారు. 2010లో 500 కోట్లు ఉండగా, 2019కి పదివేల కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన చెప్పారు. 2025 నాటికి ఏడాదికి 35వేల కోట్ల రూపాయల పరికాలు ఎగుమతి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని జైన్ తెలిపారు.