జాతీయ వార్తలు

ఆందోళన కలిగిస్తున్న టీనేజీ గర్భం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: టీనేజీలోనే గర్బం దాల్చ డం, ఆ వయస్సులో ఉన్న వారికి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తడం చాలా ఆందోళన కలిగిస్తున్నదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. కౌమర దశలో ఉన్న వారు దేశ జనాభా డివిడెండ్‌ను పొందడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ‘కౌమార ఆరోగ్యానికి పెట్టుబడి పెట్టడం - జనాభా డివిడెండ్‌ను ఉపయోగించడం’ అనే అంశంపై శనివారం జరిగిన వర్క్ షాప్‌ను కేంద్ర మంత్రి హర్షవర్దన్ లాంఛనంగా ప్రారంభించారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ - కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించాయి. ఈ సందర్భంగా మంత్రి హర్షవర్దన్ ప్రసంగిస్తూ కౌమారదశ అనేది ఒక వ్యక్తిలో సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో కీలక దశ అని తెలిపారు. ఈ వయస్సులో పెట్టుబడులు పెట్టడం అనేది యువ జనాభా కలిగి ఉండడంలో భారత దేశ ప్రయోజనాన్ని పొందడానికి ఉత్తతమైన మార్గం అని ఆయన అన్నారు. టీనేజీ గర్భాలు, చిన్న పిల్లల వివాహాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన చెప్పారు. అయితే దేశ వ్యాప్తంగా ఇది కొన్ని పాకెట్లలోనే ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. పౌష్టికాహారం, విద్య, కౌన్సిలింగ్ చేయడం వంటివి చాలా ముఖ్యమని అన్నారు. అసురక్షిత సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎస్‌టీఐ/హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌కు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. టీనేజీ గర్బాలు అంత క్షేమం కాదని, అరోగ్య సమస్యలు తలెత్తుతాయని కేంద్ర మంత్రి హర్షవర్దన్ చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో యూనిసెఫ్ భారత ప్రతినిధి యాస్మీన్ అలీ హాఖ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) ప్రతినిధి హెంక్ బెకెదాం, హిశం ముందోల్, చిన్న పిల్లల సంరక్షణ, చిల్డ్రన్స్ ఇనె్వస్ట్‌మెంట్ ఫండ్ ఫౌండేషన్, పలు స్వచ్చంద సంస్థలకు చెందిన 120 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

*చిత్రం... కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్