జాతీయ వార్తలు

ఆగని ఆందోళనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి/ షిల్లాంగ్/ కోహిమా/ కోల్‌కతా, డిసెంబర్ 14: సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో శనివారం కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ రాష్ట్రాలలో దహనకాండ సహా పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక వ్యక్తి కూడా మృతి చెందాడు. కొత్త సవరణ చట్టానికి వ్యతిరేకంగా నాగాలాండ్‌లో ఆరు గంటల పాటు బంద్ జరిగింది. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించిన తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో శనివారం కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శనకారులు దహనకాండకు పాల్పడినట్టు సమాచారం అందింది. ముస్లింల ప్రాబల్యం గల ముర్షీదాబాద్ జిల్లాలో పలు బస్సులను దగ్ధం చేసినట్టు, హౌరా జిల్లాలో ఒక రైల్వే స్టేషన్, ఒక టోల్ ప్లాజాకు ఆందోళనకారులు నిప్పు పెట్టారని అధికారులు తెలిపారు. అస్సాంలోని దిబ్రూగఢ్, గౌహతిలో శనివారం కొన్ని గంటల పాటు నిరవధిక కర్ఫ్యూను సడలించారు. వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలకు గౌహతి కేంద్ర బిందువుగా ఉంది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా కర్ఫ్యూను సడలించారు. అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలో గల ధేకియాజులి వద్ద శుక్రవారం రాత్రి కొందరు దుండగులు ఒక చమురు ట్యాంకర్‌కు నిప్పు పెట్టడంతో, ఆ ట్యాంకర్ డ్రైవర్ మృతి చెందాడు. దీంతో అస్సాంలో ఈ వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనల సందర్భంగా మృతి చెందిన వారి సంఖ్య మూడుకు పెరిగింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ వారంలో సాగిన హింసాత్మక ఆందోళనల సందర్భంగా ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే.గౌహతిలో శనివారం కూడా పాఠశాలలు, కార్యాలయాలు మూసివేసే ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల నిలిపివేతను మరో 48 గంటల పాటు అంటే డిసెంబర్ 16వ తేదీ వరకు పొడిగించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీయడానికి సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయకుండా నివారించేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి (హోం, రాజకీయ విభాగం) సంజయ్ కృష్ణ తెలిపారు. ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు).. అసోం జాతీయతాబాడి యుబ ఛాత్రా పరిషత్ (ఏజేవైసీపీ), మరో 30 స్థానిక సంఘాలతో కలిసి బ్రహ్మపుత్ర లోయలో నిరసన సభ నిర్వహించింది. ఏజేవైసీపీ ఇచ్చిన పిలుపుతో ఆందోళనకారులు రైళ్ల రాకపోకలను అడ్డుకోవడం వల్ల శనివారం గౌహతి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గాంధీజీ బోధించిన అహింసా సిద్ధాంతం ప్రకారం, ప్రతి రోజు సాయంత్రం అయిదు గంటల వరకు నిరసన కార్యక్రమాలు జరుగుతాయని ఆసు ప్రకటించింది. షిల్లాంగ్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం కర్ఫ్యూను సడలించారు. ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాల్లో కొనసాగించారు. రాష్ట్రంలో ఇన్నర్ లైన్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని తీర్మానించడానికి ఒక రోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలని మేఘాలయ ప్రభుత్వం నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో గల సంక్రాయిల్ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌లోని కొంత భాగానికి ఆందోళకారులు శనివారం నిప్పు పెట్టారు. ఆందోళకారులు అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న గార్డులను కూడా కొట్టారని అధికారులు తెలిపారు. ఆందోళనకారులు మరికొన్ని దుకాణాలకు కూడా నిప్పు పెట్టారని, అనేక చోట్ల రహదారులను దిగ్బంధించారని పోలీసులు వివరించారు.
*చిత్రం... ముంబయిలో శనివారం అస్సాం ప్రజల నిరసన ప్రదర్శన