జాతీయ వార్తలు

న్యాయాన్ని అందించడంలో జాప్యం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, డిసెంబర్ 15: పోలీసులు వేగవంతమయిన దర్యాప్తుతో అత్యాచార నేరాలను అణచివేయవలసిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆదివారం నాడిక్కడ పిలుపునిచ్చారు. న్యాయ వ్యవస్థ అత్యాచార కేసుల బాధితులకు సత్వర న్యాయాన్ని అందించలేకపోయినప్పటికీ, ఎడతెగని జాప్యం జరుగకుండా చూడవలసిన బాధ్యత దానిపై ఉందని ఆయన పేర్కొన్నారు. అత్యాచార నేరాలను ఎలాంటి వివక్ష లేకుండా, రాజకీయ రంగు పులమకుండా అణచివేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. 2012 డిసెంబర్ 16వ తేదీన ఢిల్లీ శివార్లలో నిర్భయ గ్యాంగ్ రేప్ జరిగి, ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆనాడు దేశాన్ని కుదిపేసిన ఆ సంఘటన గురించి ఆయన తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులోని ఒక ముద్దాయి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించింది. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లా కరాయి గ్రామంలోని రాష్ట్ర పోలీసు అకాడమీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమంలో ప్రత్యేక పతాకం, చిహ్నం సహా రాష్టప్రతి కలర్, స్టాండార్డ్‌ను కూడా ప్రదానం చేశారు. శ్రేష్ఠమయిన, గర్వకారణమయిన చిహ్నాన్ని అందుకొని సత్కారం పొందిన పోలీసు బలగాలలో గుజరాత్ పోలీస్ ఏడోది. ‘మహిళలు, పిల్లలపై నేరాలు ప్రత్యేకించి కిరాతక నేరాల సంఖ్య పెరగడం ననె్నంతగానో బాధకు గురిచేసింది. దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఇలాంటి నేరాలు జరుగుతున్నట్టు మనం వింటున్నాం. ఇలాంటి కేసులను రాజకీయం చేయొద్దని, రాజకీయ రంగు పులమొద్దని నేను రాజకీయ నాయకత్వాలను కోరుతున్నాను’ అని ఉప రాష్టప్రతి అన్నారు. మహిళలపై అత్యాచారాలను ఎలాంటి వివక్ష లేకుండా అణచివేయాలని ఆయన సూచించారు. ‘పోలీసులు ప్రజానుకూలంగా, మహిళలకు అనుకూలంగా వ్యవహరించాలి. మహిళలపై నేరాలను క్రియాశీలకంగా ఎదుర్కోవాలి. పోలీసులు ప్రతి ఫిర్యాదును ఎలాంటి జాప్యం లేకుండా నమోదు చేయాలి. వీలయినంత త్వరగా దర్యాప్తును పూర్తిచేసి, న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించాలి’ అని వెంకయ్య నాయుడు అన్నారు. న్యాయ విచారణను వీలయినంత త్వరగా ముగించాలని సూచిస్తూ, ఇలాంటి నేర ధోరణులను అణచివేసేట్లుగా నేరస్థులకు వీలయినంత త్వరగా శిక్షలు వేయాలని ఆయన న్యాయ వ్యవస్థను కోరారు.
*చిత్రం... ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు