జాతీయ వార్తలు

కాశ్మీర్‌కు విస్తరించే సమస్యే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలోని అధికరణం 371ను జమ్మూకాశ్మీర్‌కు విస్తరించే ఉద్దేశం ఏమాత్రం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఆదివారం నాడిక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘అధికరణం 371ను జమ్మూకాశ్మీర్‌లో అమలు చేసే సమస్యే లేదు’ అని అన్నారు. ‘భారత ప్రభుత్వంలో ఏ స్థాయిలోనూ ఈ రకమైన ఆలోచన చేయడం లేదు. అధికరణం 370 రద్దుతో చట్టవ్యతిరేకంగా పొందుతున్న తమ ప్రయోజనాలు దెబ్బతిన్న వారే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని సృష్టించి వ్యాప్తి చేస్తున్నారు’ అని సింగ్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాలలో అమలు చేస్తున్న అధికరణం 371లోని ప్రత్యేక నిబంధనలు స్థానిక ప్రజల మతపరమైన, సామాజిక పరమైన హక్కులకు రక్షణ కల్పిస్తున్నాయి. భూయాజమాన్య హక్కులు, భూవనరుల బదిలీ, ఉద్యోగాలు, విద్య వంటి అంశాలలో స్థానికుల ప్రయోజనాలను పరిరక్షిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన రెండు- జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర చట్టాలు వాటంతట అవే వర్తిస్తాయని కేంద్ర సహాయ మంత్రి అయిన జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు తగిన నోటిఫికేషన్లను జారీ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. రాజ్యాంగంలోని అధికరణం 370ని పూర్తిగా, శాశ్వతంగా రద్దు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌కు వర్తించకుండా తొలగించిన అధికరణం 370కి, ఈశాన్య భారతంలోని కొంత ప్రాంతానికి అమలు చేస్తున్న అధికరణం 371కి మధ్య సారం, స్ఫూర్తిలో వౌలికమైన వ్యత్యాసం ఉందని మంత్రి అన్నారు.