జాతీయ వార్తలు

శబరిమల ఆలయం ఆదాయం రూ.104 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబరిమల, డిసెంబర్ 15: శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయం తెరిచిన 28 రోజుల్లోనే భక్తులు హుండీలో వేసిన నగదుతో ఇప్పటికే రూ.104 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఆలయం తెరిచిన తర్వాత 28 రోజుల్లో రూ.64 కోట్లు ఆదాయం లభించింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు ఇది రెట్టింపు అని చెప్పవచ్చు. గత నెల 17న ఆలయాన్ని తెరిచామని ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు (టీడీబీ) సభ్యులు తెలిపారు. రెండు నెలల పాటు ఆలయం తెరిచి ఉంటుందన్నారు. గత ఏడాది తెరిచిన 28 రోజుల్లో రూ.64.16 కోట్లు లభించగా, ఇప్పుడు రూ.104.72 కోట్ల ఆదాయం లభించిందని వారు చెప్పారు. హుండీలో లభించిన నాణేలను లెక్కించగా ఐదు కోట్ల రూపాయలు ఉందని టీడీబీ అధ్యక్షుడు ఎన్. వాసు మీడియాకు తెలిపారు.