జాతీయ వార్తలు

నిర్భయ నిధుల వినియోగం పేలవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: దేశంలో అత్యాచార కేసులను సమర్థంగా ఎదుర్కోవడానికి ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్భయ నిధిని ఏర్పాటు చేసినా.. దాని వినియోగం మాత్రం అత్యంత తక్కువగా ఉంది. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ నిధిని కేవలం 9 శాతం మాత్రమే రాష్ట్రాలు వినియోగించుకొన్నాయి. ఇక మహారాష్ట్ర, మేఘాలయ వంటి రాష్ట్రాలు ఒక్క నయాపైసా కూడా ఖర్చు పెట్టలేదు. నిర్భయ అత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రత కోసం 1648 కోట్ల రూపాయిలతో ఈ నిధిని కేంద్రం ఏర్పాటుచేసింది. అందులో ఇప్పటివరకు కేవలం 147 కోట్ల రూపాయిలను మాత్రమే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వినియోగించుకొన్నాయి. ఇటీవల దిశ, ఉన్నావో ఘటనలతో అట్టుడికిన తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అత్యధిక స్థాయిలో ఈ నిధులను పొందాయి. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు తమకు కేటాయించిన నిధుల్లో ఏడు శాతం మొత్తాన్ని మాత్రమే వినియోగించుకొన్నాయి. ఇక ఢిల్లీకి 390 కోట్లు కేటాయిస్తే.. కేవలం మహిళల భద్రతకు 19 కోట్లు మాత్రమే వినియోగమయ్యాయి. అత్యాచార బాధితులు, సాక్షుల రక్షణ కోసం నిర్భయ నిధుల్లో మిగిలిన మొత్తాన్ని కేటాయించాలని నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి వ్యాఖ్యానించారు.
కేసులు ఎక్కువ.. శిక్షలు తక్కువ
ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా, వాటిని ఎప్పటికప్పుడు కొత్త సవరణలకు అనుగుణంగా పదును పెడుతున్నా అత్యాచార కేసుల్లో దోషులకు శిక్షలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా సంచలనం సృష్టించిన నిర్భయ.. కేసు ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ‘అత్యాచార కేసులపై దోషులకు ఏమేరకు శిక్ష పడుతుందన్న దానిపై జాతీయ నేర రికార్డుల బ్యూరో వివరాలే ఈ వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నాయి’. 2017లో లక్షా 46వేల రేప్ కేసులు నమోదైతే వాటిలో 5,822 మంది దోషులకు శిక్ష పడిందని ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో నేర నిర్దారణ పెరుగుతున్నప్పటికీ చార్జిషీటు దాఖలు మాత్రం తగ్గడం ఆందోళన కలిగిస్తోందని.. అంటే కోర్టుల వరకు వెళ్లకుండా పరిష్కారం అవుతున్నాయని స్పష్టవౌతున్నాయి. 2013లో 95.4 శాతం మేర అత్యాచార కేసుల్లో చార్జిషీట్లు దాఖలైతే.. 2017లో వీటి సంఖ్య 86.6 శాతానికి తగ్గిందని నేర రికార్డుల బ్యూరో వివరాలు చెబుతున్నాయి. అత్యాచార కేసులను విచారించే క్షేత్ర స్థాయి పోలీసు అధికారులు సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని.. అప్పుడు కేసుల నిగ్గు తేల్చగలుగుతారని శిల్పి జైన్ అనే న్యాయ నిపుణుడు వ్యాఖ్యానించారు.
నేనే ఉరి తీస్తా..
నిర్భయ హంతకులను ఉరి తీయడానికి తాను సిద్ధంగా ఉన్నానని షూటర్ వార్తికా సింగ్ ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి రక్తాక్షరాలతో లేఖ రాశారు. ఈ రేపిస్టులను ఉరి తీయడానికి హోం మంత్రి అమిత్ షా తనకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ దోషులను ఉరి తీసే అవకాశం తనకు ఇస్తే భారత్‌లో మహిళల శక్తి మరింత స్పష్టవౌతుందని ఆమె అన్నారు. ఈ విషయంలో తనకు అన్ని విధాలుగా మద్దతు ఇవ్వాలని మహిళా సైనికులు, సినీ నటీమణులు ఇలా వివిధ రంగాల్లోని మహిళలకు విజ్ఞప్తి చేశారు.