జాతీయ వార్తలు

సత్ఫలితాలు వస్తున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తమ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య జరిగిన రెండో అనియత శిఖరాగ్ర సమావేశం సానుకూల ప్రభావం క్రమంగా కనిపిస్తోందని చైనా పేర్కొంది. ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకోసం భారత్‌తో రక్షణ, భద్రతా సహకారాన్ని పెంపొందించుకోవాలని భావిస్తున్నట్టు చైనా తెలిపింది. భారత్‌లో చైనా రాయబారి సన్ వెయిడోంగ్ ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. మోదీ, జీ జిన్‌పింగ్ మధ్య జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను మరింత పెంచేందుకు ఒక ఉన్నత స్థాయి ఆర్థిక, వాణిజ్య సంప్రదింపుల యంత్రాంగాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని కూడా ఆయన తెలిపారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సీఈపీ)పై భారత్ తీసుకున్న నిర్ణయాన్ని చైనా గౌరవిస్తుందని, భారత్ లేవనెత్తిన అంశాల పరిష్కారం కోసం అన్ని భాగస్వామ్య పక్షాలతో కలిసి పనిచేయడానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. కాశ్మీర్ విషయంలో చైనా స్పష్టమయిన, స్థిరమయిన వైఖరిని కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. శాంతియుతమయిన, సుస్థిరమయిన వాతావరణం లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని చైనా రాయబారి అన్నారు. ‘చైనా, భారత్ అధినేతల మధ్య జరిగిన రెండో అనియత శిఖరాగ్ర సమావేశం సానుకూల ప్రభావం క్రమంగా కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా కొనసాగుతూ, స్థిరంగా వృద్ధి చెందుతున్నాయి’ అని సన్ పేర్కొన్నారు. భారత్, చైనా మధ్య సుమారు 3,500 కిలో మీటర్ల మేరకు ఉన్న సరిహద్దు పొడవునా ఇరు దేశాల సైన్యాల మధ్య గత కొన్ని నెలలుగా మంచి సహకారం కొనసాగుతోందని మిలిటరీ వర్గాలు తెలిపాయి. సరిహద్దు చర్చలు జరపడంతో పాటు మామల్లాపురంలో అక్టోబర్ నెలలో మోదీ-జీ జిన్‌పింగ్ మధ్య జరిగిన అనియత శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల అమలును సమీక్షించేందుకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ రుూ ఈ నెల చివరలో భారత్‌కు రానున్నారు. ‘వంద కోట్లకు పైగా జనాభాతో అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఉన్న భారత్, చైనాలు ప్రధానమయిన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా పురోగమిస్తుండటం వల్ల ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు తమ ద్వైపాక్షిక పరిమితులను అధిగమించి ప్రపంచ, వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి’ అని చైనా రాయబారి అన్నారు.
*మోదీ-జిన్‌పింగ్ (ఫైల్‌ఫొటో )