జాతీయ వార్తలు

‘సినిమాటోగ్రఫీ’కి సవరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఆరు దశాబ్దాల నాటి సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అనేక వివాదాలకు కేంద్రంగా మారిన సెన్సార్ బోర్డు పనితీరును మెరుగుపరచడానికి కేంద్రం ఈ చర్యకు పూనుకుంది. జస్టిస్ ముద్గల్ కమిటీ, బెనగల్ కమిటీ చేసిన సిఫార్సులను తాను పరిశీలిస్తున్నానని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు. అయితే ఈ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెడతామనే విషయాన్ని తాను ఇప్పుడే చెప్పలేనని ఆయన పేర్కొన్నారు. ‘జస్టిస్ (ముకుల్) ముద్గల్ కమిటీ, (శ్యామ్) బెనగల్ కమిటీ కొన్ని ముఖ్యమైన సిఫార్సులు చేశాయి. నేను వాటిని పరిశీలిస్తున్నాను. చివరకు వాటిని అమలు చేయవలసి ఉంటుంది. నేనుకూడా చట్టానికి కొన్ని సవరణలు చేయవలసి ఉంటుంది. నేను ఆ దిశగా ముందుకు సాగుతున్నాను. ఎప్పటిలోగా ఈ సవరణలు చేస్తామనేది నేను ఇప్పుడే చెప్పలేను. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సమీపిస్తున్నాయి. ఈలోగా ఈ పని పూర్తి చేస్తాననుకోవడం లేదు’ అని వెంకయ్య నాయుడు ఒక వార్తాసంస్థకు చెప్పారు. రెండు కమిటీలు చేసిన సిఫార్సులపై అభిప్రాయాలు చెప్పవలసిందిగా తాను బోర్డు సభ్యులను ఇదివరకే అడిగినట్లు ఆయన వెల్లడించారు. ఎందుకంటే సమస్యలను ఎదుర్కొంటున్న వారు కాబట్టి వారికి అంతర్గత విషయాలపై ఒక దృక్పథం ఉంటుందనేది తన విశ్వాసమని ఆయన అన్నారు. బోర్డు సభ్యులతో కలిసి చర్చించి కొన్ని ముఖ్యమైన సిఫార్సులు చేయవలసిందిగా తాను ఇటీవల బోర్డు కార్యదర్శికి సూచించినట్లు మంత్రి వెల్లడించారు. 1952నాటి సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన చెప్పారు. సెన్సార్ బోర్డు ఎదుర్కొంటున్న వివాదాల గురించి తనకు తెలుసని సుమారు నాలుగు నెలల క్రితం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన వెంకయ్యనాయుడు అన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్ట్ఫికేషన్, ఫిల్మ్ ఇండస్ట్రీ- రెండు కూడా కొంత సంయమనం పాటించాలని తాను భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.

చిత్రం.. గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం నుంచి వెలుపలకు వస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. చిత్రంలో జెపి నడ్డా, ప్రకాశ్ జావడేకర్ తదితరులు