జాతీయ వార్తలు

యుపిలో మహాకూటమి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: కుటుంబ కలహాలతో నానా తంటాలు పడుతున్న సమాజ్‌వాదీ పార్టీ మార్చిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు మహాకూటమిని ఏర్పాటుచేసి పరువు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో ప్రత్యక్ష రాజకీయ పోరాటానికి దిగిన ఎస్పీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శివపాల్‌సింగ్ యాదవ్ గురువారం ఢిల్లీలో ఆర్‌జెడి, జెడి, కాంగ్రెస్ తదితర పార్టీల నేతలతో మంతనాలు జరిపారు. అఖిలేష్, శివపాల్ మధ్య తలెత్తిన విభేదాల మూలంగా ఎస్పీ చీలిపోతుందనే వార్తల నేపథ్యంలో మహాకూటమి ఏర్పాటుకు భావసారూప్యత గల పార్టీల నేతల నుండి స్పందన రాలేదు. 2015లో బిహార్ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు జెడియు, ఆర్‌జెడి, కాంగ్రెస్, ఎస్పీలు కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసినప్పటికీ, చివరిక్షణంలో మహాకూటమి నుండి ఎస్పీ తప్పుకుంది. అయినప్పటికీ మహాకూటమి అధికారం దక్కించుకుంది.
యుపిలో బిజెపి అధికారంలోకి రాకుండా చూడాలంటే బిహార్ మాదిరిగా మహాకూటమి ఏర్పాటు తప్పదని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వాదిస్తున్నారు. అయితే బిహార్‌లో మహాకూటమికి మొండిచెయ్యి చూపించిన ములాయంతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్, ఆర్‌జెడి, జెడియులు సుముఖత చూపించటం లేదు.
వౌనం వీడిన అమర్‌సింగ్
సమాజ్‌వాదిలో తారస్థాయిలో విభేదాలు రచ్చకెక్కినా ఇంతకాలం వౌనంగా ఉన్న సీనియర్ నేత అమర్‌సింగ్ ఇన్నాళ్లకు వౌనం వీడారు. పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్‌నుంచి తనకు ప్రాణాపాయం ఉందని తనకు తగిన రక్షణ కల్పించాలని ఉత్తరప్రదేశ్ హోం శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ‘నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రస్తుతం రామ్‌గోపాల్ యాదవ్ నుంచి నాకు ప్రాణ హాని ఉంది’’ అని అమర్ గురువారం అన్నారు. సమాజ్‌వాదీలో ముసలానికి తానే కారణమన్న ఆరోపణలను ఆయన ఖండించారు. తనను దళారిగా అఖిలేష్ సంబోధించటాన్ని ఆయన తప్పుపట్టారు. డింపుల్‌తో అఖిలేష్ వివాహానికి ములాయం కుటుంబం మొత్తం వ్యతిరేకంగా ఉన్నప్పుడు తానొక్కడినే ఆ వివాహాన్ని సమర్థించి జరిగేలా చేశానని, అతని వివాహ ఫొటోల్లో ఒక్కటికూడా తాను లేకుండా లేనని ఆయన అన్నారు.