జాతీయ వార్తలు

పాలనపై రాజకీయ ఒత్తిడి వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ‘ప్రభుత్వ విధానాలను రాజకీయాలు ఎప్పుడూ ప్రభావితం చేయరాదు’’ అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. కొత్త ఐఏఎస్‌లుగా నియమితులైన అధికారుల బృందంతో గురువారం భేటీ అయిన సందర్భంగా ఆయన వారితో మాట్లాడారని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. అధికారులు టీమ్ స్పిరిట్‌తో పనిచేయాలని, అడ్డంకులను అధిగమించి, తమ శక్తిమేరకు ప్రజాసేవ చేయాలని మోదీ వారికి పిలుపునిచ్చారు. మనం తీసుకునే నిర్ణయాలు ఎట్టి పరిస్థితిలోనూ దేశ ప్రయోజనాలకు భిన్నంగా ఉండరాదని, అదే విధంగా పేదల్లోకెల్లా పేదలకు వాటివల్ల నష్టం జరగరాదని న్నారు. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు కేంద్రంలో అసిస్టెంట్ సెక్రటరీలుగా మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరు ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛ్భారత్, పర్యాటకం, ఈ-కోర్టులు, ఆరోగ్యం, పరిపాలనలో ఉపగ్రహాల వినియోగం వంటి అంశాలపై మోదీ ముందు ప్రజెంటేషన్ చేశారు. ఈ అధికారులు ఆగస్టు 1 నుంచి అసిస్టెంట్ అధికారులుగా 58 కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసి శిక్షణ పొందారు. వీళ్లంతా కూడా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాల అమలుపైనే శిక్షణ ఇచ్చారు. తమ శిక్షణ కాలంలో కేంద్ర ప్రభుత్వం పని చేసే విధానం, తమ దగ్గరకు వచ్చే వివిధ ఫైళ్లను వేగంగా పరిష్కరించటం వంటి అంశాలను నేర్చుకున్నారని సిబ్బంది వ్యవహారాల శాఖ తమ ప్రకటనలో పేర్కొంది.