రాష్ట్రీయం

జనహితమే కొలమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అద్దం పట్టే విధంగా ప్రభుత్వ విధానాల రూపకల్పనకు తోడ్పడాలని ప్రభుత్వ కార్యదర్శులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయం, ఇంధనం, రవాణా సహా పని కీలక సెక్టార్ల అభివృద్ధికి తగిన సూచనలు చేసేందుకు పది బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సందర్భంగా మోదీ మాట్లాడారు. ప్రభుత్వ పథకాల అమలు, వివిధ సెక్టార్ల అభివృద్ధిపై ఏర్పాటయ్యే ప్రభుత్వ బృందాలు అమేయమైన యువశక్తిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్యదర్శులందరికీ అనుభవం, ప్రావీణ్యం పుష్కలంగా ఉన్నాయని, వాటిని రంగరించి జనహితానికి దోహదం చేసే రీతిలో పథకాల రూపకల్పనకు దోహదం చేయాలని కోరారు. సాధించాల్సిన లక్ష్యాలు, అధిగమించాల్సిన సవాళ్లను దృష్టిలో పెట్టుకునే ఈ కార్యదర్శులు తగిన సిఫార్సులు చేయాలని, తద్వారా సమగ్రాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. తాజాగా ఏర్పాటయిన పది బృందాలు తమ సిఫార్సులను నవంబర్ నెలాఖరు లోగా అందించాలన్నారు. గురువారం ప్రభుత్వ కార్యదర్శులతో సమావేశమైన సందర్భంగా మోదీ మాట్లాడారు. ఈ సమావేశానికి కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, స్వతంత్య్ర మంత్రులు కూడా హాజరయ్యారని పిఎమ్‌ఓ తెలిపింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి జనవరిలో ఏర్పాటయిన ఎనిమిది బృందాల నివేదికలు, ఆ సిఫార్సులకు అనుగుణంగా ఇప్పటివరకూ తీసుకున్న చర్యల్ని కేబినెట్ కార్యదర్శి పికె సిన్హా వివరించారు. ప్రభుత్వ పథకాలను ఏ విధంగా అమలు చేయాలన్న దానిపైనే గతంలో కార్యదర్శులతో బృందాలను ఏర్పాటు చేశామని, తాజాగా సెక్టార్ల వారీగా సాధించాల్సిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 10 బృందాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు పిఎమ్‌ఓ వివరించింది.

చిత్రం.. గురువారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ