జాతీయ వార్తలు

మందిర నిర్మాణం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరుతుందని, ఈ విషయంలో సుప్రీం కోర్టు సానుకూలంగా తీర్పు చెప్తుందని ఆశిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి భరత్ భూషణ్ గురువారం ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘రామ మందిరం అనేది మన విశ్వాస కేంద్రం. రామ జన్మభూమి స్థలంలో మందిర నిర్మాణం జరగాలి. అలహాబాద్ హైకోర్టు ఇప్పటికే తీర్పు చెప్పింది. పెద్ద ఆలయ నిర్మాణం జరగాలని యావత్ దేశం భావిస్తోంది. ఈ విషయం సుప్రీం కోర్టు ముందుంది. వీలైనంత త్వరగా విషయం పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం’’ అని భూషణ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో ఈ అంశానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు.