జాతీయ వార్తలు

లక్షిత దాడులు చైనాపైనా చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 5: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లో నిర్వహించినట్టుగానే చైనాపై కూడా లక్షిత దాడులను నిర్వహిస్తారా? అని శివసేన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘్భరత భూభాగంలోకి చైనా చొచ్చుకు రావడాన్ని తీవ్రంగా పరిగణించవలసిన సమయం ఆసన్నమయింది. చైనాకు కూడా గట్టి బుద్ధి చెప్పవలసి ఉంది’ అని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో ప్రచురించిన సంపాదకీయంలో పేర్కొంది. ‘బహిరంగ సభలలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడి, స్పందనగా సభికుల నుంచి హర్షధ్వానాలను పొందుతున్నారు. ఈ మానసిక ప్రవృత్తి నుంచి బయటకు రావలసిన అవసరం ఉంది. చైనా దురాక్రమణపై దృష్టి కేంద్రీకరించవలసి ఉంది’ అని శివసేన సూచించింది. ‘లడఖ్ నుంచి అరుణాచల్, సిక్కిం వరకు చైనా దుందుడుకు చర్యలు నిరాఘాటంగా కొనసాగుతూనే ఉన్నాయి’ అని సంపాదకీయం పేర్కొంది. లడఖ్‌లోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించిన చైనా బలగాలను భారత నిలువరించడాన్ని ప్రస్తావిస్తూ శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది.