జాతీయ వార్తలు

నేటి నుంచి కృష్ణా ట్రిబ్యునల్ కమిటీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: కృష్ణా నదీ జలాల వివాదం పరిష్కరించే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మంగళవారం నుంచి మూడు రోజుల పాటు భేటీ కానుంది. ట్రిబ్యునల్ ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనలు వినిపించనున్నాయి. గత ఏడాది మార్చి 30 తరువాత ట్రిబ్యునల్ ఇప్పుడు సమవేశమవుతోంది. ట్రిబ్యునల్ సమావేశం జరిగే గది లో షార్ట్‌సర్కూట్ జరగడం, కీలక ఫైళ్లన్నీ దగ్ధం కావడం, ఒక సభ్యుని స్థానం ఖాళీ గా ఉండడం వంటి కారణాల వల్ల జాప్యం చోటుచేసుకుంది. నాలుగు రాష్ట్రా ల మధ్య నీటి పంపకాలు కోసం కొత్త ట్రిబ్యునల్ సాధ్యం కాదని కేంద్రం, సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో మంగళవారం నాటి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నాలుగు రాష్టాలా లేక ఆంధ్ర, తెలంగాణ మధ్యనే నీటి పంపకాలా? అన్నదానిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను ట్రిబ్యునల్ నిర్ణయిస్తుంది.