జాతీయ వార్తలు

తొలి దశలో భారీగా పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల్లో సోమవారం జరిగిన తొలి దశ పోలింగ్‌లో ఓటర్లు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటల వరకు బెంగాల్‌లో 80 శాతం, అసోంలో 70 శాతం ఓటిం గ్ నమోదయిందని డిప్యూటి ఎలక్షన్ కమిషనర్ సందీప్ సక్సేనా ఇక్కడ విలేఖరుల సమావేశంలో చెప్పారు. అయితే సాయంత్రం 5 గంటల తరువాత కూడా ఓటర్లు భారీ సంఖ్యలో క్యూలో నిలబడి ఉన్నారని, అందువల్ల ఓటింగ్ శాతం ఇంకా పెరుగుతుందని ఆయన వివరించారు. తొలి దశ పోలింగ్ మొత్తంమీద ప్రశాంతంగా ముగిసిందని, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలలో బెంగాల్‌లో 83.72 శాతం, అసోంలో 75 శాతం పోలింగ్ నమోదయింది. బెంగాల్‌లో 18 నియోజకవర్గాలలో, అసోంలో 65 నియోజకవర్గాలలో పోలింగ్ జరిగింది.