జాతీయ వార్తలు

మహిళలకూ ఆలయ ప్రవేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధం విషయంలో కేరళ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. పట్టనంతిట్ట జిల్లాలో గల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ‘అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలి’ అని సిపిఎం నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది. పది నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు ఆలయ ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడానికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని గత యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) ప్రభుత్వం వ్యతిరేకించింది. న్యాయ ప్రక్రియ ద్వారా భక్తుల విశ్వాసాలను, ఆచారాలను మార్చజాలమని, మత వ్యవహారాలలో పురోహితులదే తుది నిర్ణయమని అప్పటి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ నేతృత్వంలోని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వాస్తవానికి, ఊమెన్ చాందీకి ముందు విఎస్ అచ్యుతానందన్ నేతృత్వంలో ఉన్న కేరళ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం కూడా ఇప్పటి విజయన్ ప్రభుత్వం ప్రకటించిన వైఖరినే తీసుకుంది. మధ్యలో వచ్చిన చాందీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. పది నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు గల మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడాన్ని శబరిమల ఆలయ పాలనాయంత్రాంగం కూడా వ్యతిరేకిస్తోంది. మత వ్యవహారాలలో సంప్రదాయం ముఖ్యమని పేర్కొంటోంది. కాగా, సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను వ్యతిరేకిస్తూ దశాబ్దం క్రితం దాఖలయిన పిటిషన్‌ను విచారించే ధర్మాసనం మారిన తరువాత తొలిసారి సోమవారం ఈ కేసు విచారణకు వచ్చింది. గతంలో న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని న్యాయమూర్తులు గోపాల వి గౌడ, కురియన్ జోసెఫ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారించింది. జూలై 11న గోపాల వి గౌడ, కురియన్ జోసెఫ్‌ల స్థానంలో న్యాయమూర్తులు సి.నాగప్పన్, ఆర్.్భనుమతి ధర్మాసనంలో చేరారు.