జాతీయ వార్తలు

ఇంక్ పడుద్ది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: ఎన్నికల సమయంలో ఓటేసేందుకు వెళ్లిన ఓటర్లకు గుర్తుగా వేలిపై ఉంచే ఇంక్ మార్క్‌ను ఇకపై బ్యాంకుల్లో కూడా వాడనున్నారు. పాతనోట్లను ఎక్స్ఛేంజి చేసుకునేందుకు బ్యాంకులకు వెళ్లే వినియోగదారులకు ఇంక్‌మార్క్ వేసేందుకు వీలుగా అవసరమైనంత ఇంక్‌ను సంసిద్ధంగా ఉంచుకోవాలని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్‌ను కేంద్రం ఆదేశించింది. ‘ఇంక్ సీసాలు సిద్ధం చేయాలని మాకు ఆదేశాలందాయి’ అని మైసూర్ ఇంక్ మేనేజర్ సి హరకుమార్ తెలిపారు. అయితే ఎన్ని సీసాలు అవసరమవుతాయన్నది ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదని ఆయన వివరించారు. కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ అయిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ఈ చెరగని ఇంక్‌ను దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కొన్ని విదేశాలకు కూడా సరఫరా చేస్తుంది.