జాతీయ వార్తలు

నాలుగేళ్లలో కోటి ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగర్‌మాల ప్రాజెక్టు కింద రానున్న నాలుగయిదేళ్లలో కనీసం ఒక కోటి ఉద్యోగాలు సృష్టించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశానికి ఉన్న 7,500 కిలో మీటర్ల తీర ప్రాంతంలో ఓడ రేవులు తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే ఉద్దేశంతో ఈ సాగర్‌మాల ప్రాజెక్టును చేపట్టారు. గడ్కరీ అధ్యక్షతన శనివారం ఇక్కడ రెండో జాతీయ సాగర్‌మాల అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానంతరం గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ సాగర్‌మాల ప్రాజెక్టు కింద కేవలం షిప్పింగ్, ఓడరేవుల రంగంలోనే ఒక కోటి ఉద్యోగాలను సృష్టించనున్నట్లు తెలిపారు. వీటిలో 40 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 60 లక్షల పరోక్ష ఉద్యోగాలు ఉంటాయని ఆయన వివరించారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్, ఉక్కు శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. ముంబయిలో ఈ నెల 14 నుంచి 16 వరకు జరుగనున్న మారిటైమ్ ఇండియా సమ్మిట్‌లో ఈ రంగంలో రూ. రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని గడ్కరీ తెలిపారు. మారిటైమ్ రంగంలో భారత్‌కు ఉన్న అద్భుతమైన అవకాశాలను ఉపయోగించుకోవడానికి ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశ ఆర్థికాభివృద్ధికి రేవుల రంగం ఛోదకశక్తి కాగలదన్న ప్రధాని మోదీ ప్రకటనలకు అనుగుణంగా సముద్ర తీరంలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసకుంటున్నట్లు గడ్కరీ వివరించారు. దేశంలోని 111 నదులను జలరవాణా మార్గాలుగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాగర్‌మాల కార్యక్రమం కింద 150 ప్రాజెక్టులను గుర్తించినట్లు చెప్పారు. ఓడరేవుల వద్ద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 13 రాష్ట్రాల్లో కోస్తా ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యం ఇస్తామని, దీనివల్ల లక్షలాది మంది మత్స్యకారులు లబ్ధి పొందుతారని మంత్రి వివరించారు.

chitram ఢిల్లీలో జరిగిన సాగరమాల అపెక్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, నరేంద్రసింగ్ తోమర్, ప్రకాశ్ జావడేకర్ ష