జాతీయ వార్తలు

మూర్ఖ నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలో ఒక వ్యక్తి చేసిన ఆర్థిక విధ్వంసంగా విపక్షాలు తీవ్రస్థాయిలో మోదీ సర్కారుపై గురువారం విరుచుకుపడ్డాయి. పెద్ద కరెన్సీని రద్దు చేసి నెలరోజులైన సందర్భంగా అన్ని విపక్షాల నేతలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు బ్లాక్‌డేను పాటించారు. నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఒక మూర్ఖ నిర్ణయమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రతిరోజూ పత్రికల్లో హెడ్‌లైన్లలో రావటానికి విపక్షాలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఆర్థిక అరాచకాన్ని సృష్టించారన్నారు. కాంగ్రెస్ నాయకులతోపాటు, తృణమూల్, సిపిఎం, సిపిఐ, జెడియు, సమాజ్‌వాది పార్టీ నేతలు తమ చేతులకు నల్లబ్యాడ్జిలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల దాదాపు వందమంది మరణించారని, రైతులు, జాలర్లు, దినసరి వేతన కూలీలు నానా అవస్థలు పడుతున్నారని రాహుల్ ఆరోపించారు. దేశంలో ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి మోదీ ఒక్కరే బాధ్యులని తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. అయితే కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల అందోళనపై కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇది నల్లదనం మద్దతు రోజు అని ఆయన అన్నారు. టిఆర్‌పి రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్‌తో రాహుల్ గాంధీ పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.

చిత్రం..పెద్దనోట్ల రద్దుకు నిరసనగా గురువారం పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు బ్లాక్ డే పాటిస్తున్న ప్రతిపక్ష పార్టీలు